సుశాంత్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. అతడిది హత్యేనని ఆస్పత్రి సిబ్బంది ప్రకటన
సుశాంత్ ది ఆత్మహత్య కాదని తాము మొదటి నుంచి వాదిస్తున్నామని.. ఇప్పుడు అదే నిజమైందని అతడి అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ టాపిక్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రెండేళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక బాలీవుడ్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. సొంతంగా పైకి వచ్చే వారిని కొందరు బాలీవుడ్ ప్రముఖులు తొక్కేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. బాలీవుడ్ లోని నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతడి అభిమానులు ఆరోపించారు. సుశాంత్ తన ప్లాట్ లోని ఓ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అప్పట్లో పోలీసులు ప్రకటించారు.
అయితే తాజాగా ఈ కేసు మలుపు తిరిగింది. అతడి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించిన కూపర్ ఆస్పత్రి సిబ్బంది సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. హత్య అని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. సుశాంత్ సింగ్ డెడ్ బాడీ పోస్టుమార్టానికి వచ్చిన సమయంలో శరీరంపై, మెడపై గాయాలు కనిపించాయని ఆసుపత్రి సిబ్బంది తెలపడం కలకలం రేపుతోంది. సుశాంత్ పోస్టుమార్టంకు హాజరైన సిబ్బంది రూప్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ చనిపోయిన రోజు తమ ఆసుపత్రికి ఐదు శవాలు వచ్చినట్లు తెలిపారు. అందులో సుశాంత్ శరీరానికి పోస్ట్ మార్టం చేసేందుకు తాము వెళ్లామని చెప్పారు.
సుశాంత్ శరీరంపై, మెడపై తమకు గాయాలు కనిపించాయి. అప్పుడే తమకు అతడిది ఆత్మహత్య కాదని.. హత్య అని అర్థమైందన్నారు. మామూలుగా వీడియో తీస్తూ పోస్టుమార్టం చేయాల్సి ఉండగా.. అధికారులు మాత్రం కేవలం ఫొటోలు మాత్రమే తీయాలని చెప్పడంతో తాము అలాగే చేసి డెడ్ బాడీని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఇన్నాళ్లు సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. అంతా భావిస్తూ వస్తుండగా తాజాగా ఆసుపత్రి సిబ్బంది చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
సుశాంత్ ది ఆత్మహత్య కాదని తాము మొదటి నుంచి వాదిస్తున్నామని.. ఇప్పుడు అదే నిజమైందని అతడి అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ టాపిక్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుశాంత్ మరణంపై తాజాగా ఆస్పత్రి సిబ్బంది వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ విషయం మరోసారి ట్విటర్లో ట్రెండింగ్ గా మారింది.