రాహుల్ గాంధీకి మధ్యంతర బెయిల్
తనకు పడిన శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. కోర్టు రాహుల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కేసును ఏప్రెల్ 13వ తేదీకి వాయిదా వేసింది.
BY Telugu Global3 April 2023 4:26 PM IST
X
Telugu Global Updated On: 3 April 2023 4:26 PM IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ లోని సెషన్స్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువును ఏప్రిల్ 13 వరకు విధించింది.
''దొంగలందరి ఇంటి పేరు మోడీ అనే ఎందుకుంటుంది ?'' అని రాహుల్ గాంధీ కర్నాటకలో చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్ సూరత్ లోని కోర్టు ఆయనకు రెండేళ్ళు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, పూర్ణేశ్ మోడీ వేసిన పరువునష్టం కేసులో ఆయనకు ఈ జైలుశిక్ష పడింది.
తనకు పడిన శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. కోర్టు రాహుల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కేసును ఏప్రెల్ 13వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, నేటి విచారణ సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులు సూరత్ వెళ్ళారు.
Next Story