ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
ఒక స్వతంత్ర యంత్రాంగం ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ KM జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. తాము సూచించిన ప్యానెల్ సలహా మేరకు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ అధికారాన్ని పరిమితం చేస్తూ, ఓ కమిటీకి ఆ అధికారాన్ని కట్టపెడుతూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆ కమిటీలో ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత , చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లు ఉండాలని తెలిపింది.
ఒక స్వతంత్ర యంత్రాంగం ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ KM జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. తాము సూచించిన ప్యానెల్ సలహా మేరకు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
ఎన్నికలు సక్రమంగా జరగాలంటే ఈసీ (EC)ల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కోర్టు పేర్కొంది. ఎలాంటి ఒత్తిడులు లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలను నిర్వహించగలగాలని, ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సరళి స్వచ్ఛంగా లేకపోతే అది వినాశకరమైన పరిణామాలకు దారి తీస్తుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.