వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
2021 నుంచి ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని, సీబీఐ తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తిచేసేందుకు ఎన్ని సంవత్సరాలు కావాలని ఈ సందర్భంగా ప్రశ్నించింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారిని మార్చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
2021 నుంచి ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని, సీబీఐ తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తిచేసేందుకు ఎన్ని సంవత్సరాలు కావాలని ఈ సందర్భంగా ప్రశ్నించింది. విచారణ అధికారిని మార్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. లేదంటే మరో అధికారిని కూడా నియమించాలని స్పష్టం చేసింది.
దర్యాప్తు ఇలా కొనసాగడం మంచిది కాదన్న ధర్మాసనం.. ఈ కేసులో విస్తృత కుట్రను బయటికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ అంశాలన్నీ సీబీఐ డైరెక్టర్‌కు చెప్పాలని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని బెంచ్ సీబీఐని ఆదేశించింది.