Telugu Global
National

పెద్ద నోట్ల రద్దును సమర్ధించిన సుప్రీం కోర్టు

జస్టిస్ ఎస్‌ఏ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గతం లోనే ఇరు వర్గాల వాదనలు విని తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ రోజు తన తీర్పును వెలువరించింది కోర్టు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

పెద్ద నోట్ల రద్దును సమర్ధించిన సుప్రీం కోర్టు
X

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016 లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న‌ నిర్ణయానికి సుప్రీం కోర్టు మద్దతునిచ్చింది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లను కోర్టు కొట్టి వేసింది.

జస్టిస్ ఎస్‌ఏ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గతం లోనే ఇరు వర్గాల వాదనలు విని తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ రోజు తన తీర్పును వెలువరించింది కోర్టు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నిర్ణయం లోపభూయిష్టంగా లేదని, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో ఆరు నెలల పాటు సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయ‍ం తీసుకున్నదని ఐదుగురిలో నలుగురు న్యాయమూర్తులు పేర్కొన్నారు.

అయితే ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన న్యాయమూర్తి బివి నాగరత్న మాత్రం భిన్నమైన తీర్పు నిచ్చారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం కాకుండా పార్లమెంటు చేయాల‌ని నాగరత్న పేర్కొన్నారు.

1,000, 500 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ నవంబర్ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాదాపు 58 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ చర్య కారణంగా ₹ 10 లక్షల కోట్లు రాత్రికి రాత్రే చెలామణిలో లేకుండా పోయాయి. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, దానిని కోర్టు కొట్టివేయాలని పిటిషన్లు వాదించారు.

కాగా తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేమని, సమయాన్ని వెనక్కి తిప్పలేమని కేంద్రం వాదించింది. పైగా పెద్ద నోట్ల రద్దు అనేది చక్కగా ఆలోచించి తీసుకున్న‌ నిర్ణయమని, నకిలీ నోట్లు, టెర్రర్ ఫైనాన్సింగ్, నల్లధనం, పన్ను ఎగవేతలను ఎదుర్కోనే పెద్ద వ్యూహంలో ఇది భాగమని కూడా కేంద్రం పేర్కొంది.

First Published:  2 Jan 2023 12:05 PM IST
Next Story