Telugu Global
National

ప్రొఫెసర్ సాయిబాబా విడుదలకు బ్రేక్... హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు

ప్రొఫెసర్ సాయిబాబా విడుదలకు సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. ఆయనతో సహా మొత్తం ఐదుగురిపై ఉన్నUAPA కేసును నిన్న బోంబే హైకోర్టు కొట్టివేయగా ఆ తీర్పును ఈ రోజు సుప్రీం కోర్టు సస్పెండ్ చేసింది.

ప్రొఫెసర్ సాయిబాబా విడుదలకు బ్రేక్... హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు
X

మావోయిస్టు సంబంధాలకు సంబంధించిన కేసులో ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు అక్టోబర్ 14న ఇచ్చిన ఆదేశాలను శనివారం సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఈ కేసులో ఉన్న సాయిబాబాతో సహా ప్రశాంత్ రాహీ, హేం మిశ్రా, విజయ్ టిక్రి, మహేశ్ టిక్రి ల విడుదల ఆగిపోయింది.

నిన్న బోంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన కొద్ది సేపటికే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాంతో ఈ రోజు శనివారమైనప్పటికీ ప్రత్యేకంగా ఈ కేసును స్వీకరించిన సుప్రీం కోర్టు బెంచ్ హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసింది.

కాగా అరెస్టయిన ఎనిమిదేళ్ల తర్వాత, బొంబాయి హైకోర్టు శుక్రవారం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించి జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. వీరిపై జారీ చేసిన UAPA నిబంధనలు చెల్లవు అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ అనుమతించింది.

హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ వేగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

First Published:  15 Oct 2022 1:10 PM IST
Next Story