గాలి జనార్ధనరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ !
గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన బెయిల్ నిబంధనలు సడలించాలంటూ ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.

అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ నిబంధనలు సడలించాలంటూ ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్ ను కొట్టివేసింది.
ఈ కేసులో ట్రయల్ మొదలుపెట్టాలని హైదరాబాదు సీబీఐ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇకనుంచి రోజువారీ విచారణ చేపట్టాలని, 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కాగా, గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో నెల రోజులే ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నిబందనలను సవరిస్తూ మరింత కాలం తాను బళ్ళారిలో ఉండే అవకాశం కల్పించాలని కోరుతూ జనార్దనరెడ్డి పిటిషన్ లో కోరారు.
ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి పై సిబిఐ పలు అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.