Telugu Global
National

హౌసింగ్‌ సొసైటీలకు సుప్రీం కోర్టు షాక్

జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్‌ సొసైటీలకు భూకేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది

హౌసింగ్‌ సొసైటీలకు సుప్రీం కోర్టు షాక్
X

జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్‌ సొసైటీలకు భూకేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాజకీయ నాయకులకు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇంతేకాకుండా సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.హౌజింగ్‌ సొసైటీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ ఉద్యోగులు,జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వంలో గతంలో భూ కేటాయింపులు జరిపింది.

First Published:  25 Nov 2024 12:04 PM IST
Next Story