Home > NEWS > National > పేరు ముందు కుమారి, శ్రీమతి లాంటి పదాలు అడగొద్దంటూ పిటిషన్.. - కొట్టేసిన సుప్రీంకోర్టు
పేరు ముందు కుమారి, శ్రీమతి లాంటి పదాలు అడగొద్దంటూ పిటిషన్.. - కొట్టేసిన సుప్రీంకోర్టు
కుమారి, శ్రీమతి లాంటి పదాలను పేరుకు ముందు పెట్టుకోవాలని మహిళను అడగకూడదని మీరంటున్నారు.. ఒకవేళ ఎవరైనా వాడాలనుకుంటే.. వారినెలా కట్టడి చేస్తారు అని ప్రశ్నించింది.
BY Telugu Global16 May 2023 10:49 AM IST
X
Telugu Global Updated On: 16 May 2023 11:37 AM IST
తమ పేరు ముందు కుమారి, శ్రీమతి లాంటి పదాలు అడగొద్దంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దానిని సోమవారం నాడు ధర్మాసనం కొట్టేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఇది ప్రచారానికి మాత్రమే దాఖలు చేసిన దావాలా కనిపిస్తోందని పేర్కొంది.
కుమారి, శ్రీమతి లాంటి పదాలను పేరుకు ముందు పెట్టుకోవాలని మహిళను అడగకూడదని మీరంటున్నారు.. ఒకవేళ ఎవరైనా వాడాలనుకుంటే.. వారినెలా కట్టడి చేస్తారు అని ప్రశ్నించింది. దీనికోసం ఒక సాధారణ పద్ధతి అంటూ ఏమీ లేదని, పేరుకు ముందు ఆ పదాలను వాడాలా.. లేదా అనేది ఆ వ్యక్తి ఎంపికకనుసరించి ఉంటుందని వివరించింది. ఈ సందర్భంగా ఆ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.
Next Story