Telugu Global
National

విద్వేష ప్రసంగాలు, మీడియా పాత్రపై సుప్రీం వ్యాఖ్యలు

న్యాయ కమిషన్ సూచించిన విధంగా విద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేసే ఆలోచన ఏమైనా ఉందా? లేదా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. టీవీ చర్చల్లో యాంకర్ల పాత్రపైనా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది.

విద్వేష ప్రసంగాలు, మీడియా పాత్రపై సుప్రీం వ్యాఖ్యలు
X

టీవీ ఛానళ్ల పోకడపై సుప్రీంకోర్టు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్త ఛానళ్లలో విద్వేషపూరిత ప్రసంగాల ప్రసారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి చర్యలతో జాతిని విషతూల్యం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తోందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

న్యాయ కమిషన్ సూచించిన విధంగా విద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేసే ఆలోచన ఏమైనా ఉందా? లేదా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. టీవీ చర్చల్లో యాంకర్ల పాత్రపైనా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. చర్చల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చోటు చేసుకోకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత యాంకర్లపై ఉంటుందని గుర్తు చేసింది. కానీ ప్రధాన టీవీ ఛానళ్ల చర్చల్లోనూ విద్వేషకరమైన పోకడ కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు మరో వర్గాన్ని తక్కువ చేస్తే ఆ వర్గానికి చెందిన వారు ఎలా స్పందిస్తారో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. టీవీ ఛానళ్లు ధర్మకర్తల్లాంటి వారని వ్యాఖ్యానించింది. విద్వేష ప్రసంగాల కారణంగా ఘర్షణలకు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ప్రసంగాలను నిలువరించేందుకు గట్టి వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్వేష ప్రసంగాలను అడ్డుకునేందుకు చట్టం తీసుకొచ్చే యోచన ఉందా? లేదా? అన్నది స్పష్టం చేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది.

First Published:  22 Sept 2022 9:07 AM IST
Next Story