Telugu Global
National

గుజరాత్ లోని బ్రిడ్జి ప్ర‌మాదంపై నవంబర్ 14న సుప్రీం కోర్టులో విచార‌ణ

135 మంది మరణించిన గుజరాత్ లోని బ్రిడ్జి కూలిన సంఘటన‌పై నవంబర్ 14న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ప్ర‌మాద‌క‌ర‌ వంతెనల ప‌రిస్థితుల‌పై సర్వే చేసేందుకు అంచనా కమిటీని ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఒక న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

గుజరాత్ లోని బ్రిడ్జి ప్ర‌మాదంపై నవంబర్ 14న సుప్రీం కోర్టులో విచార‌ణ
X

గుజరాత్‌లోని మోర్బీలో బ్రిడ్జి కూలిన ఘటనపై న్యాయ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నవంబర్ 14న విచారణకు స్వీక‌రించ‌నుంది.

పర్యావరణ సానుకూల‌త‌, భద్రతను నిర్ధారించేందుకు పురాత‌న, ప్రమాదకర స్మారక చిహ్నాల‌తో పాటు ప్ర‌మాద‌క‌ర‌ వంతెనల ప‌రిస్థితుల‌పై సర్వే చేసేందుకు అంచనా కమిటీని ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఒక న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం ఈ నెల 14న విచార‌ణకు నిర్ణ‌యించింది.

ఇదిలా ఉండ‌గా, మోర్బి జిల్లా ఆసుపత్రిలో మంగళవారం ఉదయం మరొకరు గాయాలతో మరణించారు, దీంతో వంతెన కూలిన సంఘటనలో మరణించిన వారి సంఖ్య 135 కి చేరుకుందిని అధికారులు తెలిపారు.

వంతెన కూలిపోవడంపై విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీలో రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి సందీప్ వాసవాతో పాటు మరో నలుగురు సీనియర్ అధికారులు ఉన్నారు. బ్రిడ్జి కూలిపోవడంపై సెక్షన్‌లు 304 , 308, 114 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మ‌ర‌మ్మ‌తుల కోసం మార్చి నుండి మూసివేసిన మోర్బిలోని బ్రిటిష్ కాలం నాటి సస్పెన్షన్ వంతెన ఆదివారం రాత్రి కూలిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నెల 26 వ తేదీన ఈ వంతెన ను రీ ఓపెన్ చేశారు. ఈ ప్ర‌మాదంలో ప‌లువురు చిన్నారులు స‌హా 135 మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

First Published:  1 Nov 2022 12:44 PM IST
Next Story