Telugu Global
National

చెక్‌ బౌన్స్‌ కేసుల్లో రాజీ చేసుకుంటే ఓకే!

ఫిర్యాదుదారుడికి నిందితుడు రూ.5.25 లక్షల పరిహారం చెల్లించి కుదుర్చుకున్న రాజీ ఒప్పందాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. కాంపౌండబుల్‌ అఫెన్స్‌ కింద వాది, ప్రతివాదులు రాజీ కుదుర్చుకోవచ్చని ఈ సందర్భంగా పేర్కొంది.

చెక్‌ బౌన్స్‌ కేసుల్లో రాజీ చేసుకుంటే ఓకే!
X

చెక్‌ బౌన్స్‌ కేసుల్లో వాది, ప్రతివాదులు రాజీకి సిద్ధపడితే న్యాయస్థానాలు దానిని ప్రోత్సహించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ కింద వీటిని కాంపౌండబుల్‌ అఫెన్స్‌గా పరిగణించాలని తెలిపింది. ఇప్పటికే న్యాయస్థానాల్లో చెక్‌ బౌన్స్‌ కేసులు భారీస్థాయిలో పేరుకుపోవడంపై సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం న్యాయస్థానాలకు ఈ సూచన చేసింది.

ఒక చెక్‌ బౌన్స్‌ కేసులో పి.కుమారస్వామి అనే వ్యక్తికి పడిన జైలు శిక్షను జస్టిస్‌ సుధాంశు ధూలియా, జస్టిస్‌ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం రద్దు చేసింది. ఫిర్యాదుదారుడికి నిందితుడు రూ.5.25 లక్షల పరిహారం చెల్లించి కుదుర్చుకున్న రాజీ ఒప్పందాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. కాంపౌండబుల్‌ అఫెన్స్‌ కింద వాది, ప్రతివాదులు రాజీ కుదుర్చుకోవచ్చని ఈ సందర్భంగా పేర్కొంది. చెక్‌ బౌన్స్‌ కేసుల్లో శిక్ష వేయడానికి బదులు వాది, ప్రతివాదులు రాజీ కుదుర్చుకునేలా న్యాయస్థానాలు ప్రోత్సహించాలని ధర్మాసనం పేర్కొంది.

First Published:  20 July 2024 6:10 AM GMT
Next Story