Telugu Global
National

లాయ‌ర్ల‌ స‌మ్మెకు సుప్రీం నో

బార్‌లోని స‌భ్యునికి నిజ‌మైన ఫిర్యాదు ఉంటే.. కేసు దాఖ‌లు, జాబితాలో విధాన మార్పుల వ‌ల్ల జిల్లా న్యాయ‌వ్య‌వ‌స్థ స‌భ్యుడి వ‌ల్ల దుష్ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే వారు ప‌రిష్కార క‌మిటీల‌ను ఆశ్ర‌యించాల‌ని సూచించారు.

లాయ‌ర్ల‌ స‌మ్మెకు సుప్రీం నో
X

లాయ‌ర్లు స‌మ్మె కార్య‌క‌లాపాల‌కు వెళ్ల‌రాద‌ని, విధుల‌కు దూరంగా ఉండ‌రాద‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. న్యాయ‌వాదుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అన్ని హైకోర్టులూ ఫిర్యాదుల ప‌రిష్కార క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల నేతృత్వంలో వీటిని ఏర్పాటు చేయాల‌ని తెలిపింది.

తమ ఫిర్యాదుల పరిష్కారానికి తగిన ఫోరమ్‌ను కోరుతూ డెహ్రాడూన్‌లోని డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ దాఖలు చేసిన దరఖాస్తును ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలాగే ఈ ఆర్డర్ కాపీని అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌కు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. బార్ లేవ‌నెత్తిన అంశాల్లో వాస్త‌వం ఉండొచ్చ‌ని జ‌స్టిస్ ఎంఆర్ షా, జ‌స్టిస్ ఎ.అమానుల్లా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం అంగీక‌రించింది. వాటి ప‌రిష్కారానికి ఓ వేదిక ఉండాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పింది.

బార్‌లోని స‌భ్యునికి నిజ‌మైన ఫిర్యాదు ఉంటే.. కేసు దాఖ‌లు, జాబితాలో విధాన మార్పుల వ‌ల్ల జిల్లా న్యాయ‌వ్య‌వ‌స్థ స‌భ్యుడి వ‌ల్ల దుష్ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే వారు ప‌రిష్కార క‌మిటీల‌ను ఆశ్ర‌యించాల‌ని సూచించారు. త‌ద్వారా స‌మ్మెల‌ను నివారించాల‌ని స్ప‌ష్టం చేశారు.

అన్ని హైకోర్టులను వారి సంబంధిత హైకోర్టులలో ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు చేయమని సూచిస్తున్నామ‌ని ధ‌ర్మాస‌నం చెప్పింది. ఇది ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉండాల‌ని, అటువంటి ఫిర్యాదుల పరిష్కార కమిటీలో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు ఉండాల‌ని తెలిపింది. వారిలో న్యాయ సేవ‌ల నుంచి ఒక‌రు, బార్ నుంచి మ‌రొక‌రు నామినేట్ చేయ‌బ‌డ‌తార‌ని పేర్కొంది. హైకోర్టులు జిల్లా కోర్టు స్థాయిలోనూ ఇలాంటి ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు చేయవచ్చని ధర్మాసనం తెలిపింది. ఫోరమ్.. బార్‌లోని సభ్యులు తమ మనోవేదనలను వినిపించే ప్రదేశంగా ఉండాలని పేర్కొంది.

First Published:  21 April 2023 3:16 AM GMT
Next Story