మీ వివాహ బంధాన్ని పునరుద్దరించే అవకాశమే లేదు
ఒక జంట వివాహబంధం కేసులో సుప్రీం కోర్టు
20 ఏళ్లుగా దూరంగా ఉంటున్న ఒక జంట వివాహ బంధాన్ని పునరుద్దరించే అవకాశమే లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన తీర్పును ఇటీవల వెలువరించింది. తమిళనాడుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ దంపతులకు 20 ఏళ్ల క్రితం మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ విడాకులు మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును కొట్టేసి తన భర్తతో వివాహ బంధంలో కొనసాగే అవకాశం కల్పించాలని ఆమె సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల బంధం పరస్పర విశ్వాసం, సహచర్యం, భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుందని కామెంట్ చేసింది. దంపతుల మధ్య ఇలాంటివేమి లేకుండా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య పరస్పర విరోధాలు కనిపిస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో వివాహ బంధాన్ని పునరుద్దరించే అవకాశాలే లేవని స్పష్టమవుతోందని తీర్పులో వెల్లడించింది.