Telugu Global
National

తన అరెస్టుపై సుప్రీం కోర్టుకు మనీష్ సిసోడియా... నేడు విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

తమ‌ పిటిషన్ పై అత్యవసర విచారణను కోరుతూ సిసోడియా తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఆ వాద‌నలు విన్న ధర్మాసనం ఆ పిటిషన్ ను ఈ రోజు విచారించడానికి అంగీకరించింది.

తన అరెస్టుపై సుప్రీం కోర్టుకు మనీష్ సిసోడియా... నేడు విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం
X

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది.

తమ‌ పిటిషన్ పై అత్యవసర విచారణను కోరుతూ సిసోడియా తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఆ వాద‌నలు విన్న ధర్మాసనం ఆ పిటిషన్ ను ఈ రోజు విచారించడానికి అంగీకరించింది.

మరో వైపు సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు,కార్యకర్తలు వివిధ రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. సిసోడియా అరెస్టు వెనుక బీజేపీ ప్రతీకార రాజకీయాలున్నాయ‌ని ఆప్ నాయకులు ఆరోపించారు.

AAP కార్యకర్తలు ఢిల్లీలో తమ పార్టీ కార్యాలయం వెలుపల నిరసన తెలిపారు. “మనీష్ సిసోడియాను తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని ఆరోపించిన కార్యకర్తలు తాము కూడా అరెస్టు కావడానికే రోడ్డెక్కామని అన్నారు.

“ఆప్‌లోని ప్రతి నాయకుడిని, ఎమ్మెల్యేను, మంత్రిని అరెస్టు చేయాలని కేంద్రం కోరుకుంటోంది. అందుకే మేం కూడా అరెస్ట్ కావడానికే వచ్చాం. మమ్మల్నందరినీ అరెస్టు చేసి మా పార్టీని అంతం చేయండి. భారతదేశంలో నియంతృత్వం ఉందని, ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని ప్రపంచం తెలుసుకోవాలి'' అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు.

First Published:  28 Feb 2023 12:52 PM IST
Next Story