Telugu Global
National

కర్నాటకలో బీజేపీని ఇరుకున పెట్టిన సన్నీ లియోన్..

హాల్ టికెట్ పై ఫొటో తప్పుగా ప్రింట్ అయితే కవర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సన్నీ లియోన్ ఫొటో రావడం, అది కూడా అర్ధ‌నగ్నంగా ఉండటంతో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

కర్నాటకలో బీజేపీని ఇరుకున పెట్టిన సన్నీ లియోన్..
X

హాల్ టికెట్ లో అభ్యర్థి ఫొటో మార్చి మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడిన ఉదాహరణలో గతంలో ఉన్నాయి. కానీ కర్నాటకలో మాత్రం పరీక్ష నిర్వహించే అధికారులే ఫొటో మార్చేశారు. ఓ మహిళా అభ్యర్థి టీచర్ రిక్రూట్ మెంట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా ఆమెకు ఇటీవలే హాల్ టికెట్ వచ్చింది. అయితే అందులో ఆమె ఫొటో బదులు సన్నీలియోన్ ఫొటో ఉంది. అది కూడా అర్ధ‌నగ్న ఫొటో కావడంతో ఆమె షాక్ అయింది. ఆ వ్యవహారం ఆ నోటా ఈ నోటా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు కర్నాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

గతంలో కర్నాటక అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు పోర్న్ ఫిల్మ్స్ చూసిన ఉదాహరణలున్నాయి. అలాంటి నాయకుల పాలనలో.. టీచర్ రిక్రూట్ మెంట్ పరీక్షల్లో అభ్యర్థుల ఫొటోలకు బదులు, పోర్న్ స్టార్స్ ఫొటోలు పెట్టడం పెద్ద పనేం కాదంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. కర్నాటక కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ బీఆర్ నాయుడు రాష్ట్ర విద్యాశాఖపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్స్ చూసే పార్టీ నుంచి ఇంకేం ఆశించగలం అంటూ ఆయన ట్వీట్ చేశారు.

బీజేపీ నష్టనివారణ చర్యలు..

హాల్ టికెట్ పై ఫొటో తప్పుగా ప్రింట్ అయితే కవర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సన్నీ లియోన్ ఫొటో రావడం, అది కూడా అర్ధ‌నగ్నంగా ఉండటంతో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పడానికి ఈ ఊదాహరణ చాలని అంటున్నారు నెటిజన్లు. పరీక్ష ఫీజులు కలెక్ట్ చేసుకోవడంపై పెట్టిన శ్రద్ధ, అభ్యర్థుల ఫొటోలను అప్ లోడ్ చేయడంపై ఎందుకు చూపించరని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ స్పందించారు. పూర్తి విచారణ జరిపి త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కర్నాటక విద్యాశాఖ వివరణ ఇచ్చింది. కానీ సన్నీ లియోన్ ఫొటో వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం కర్నాటకలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఘటన హాట్ టాపిక్ అయింది.

First Published:  9 Nov 2022 7:37 AM IST
Next Story