గుజరాత్ లో అసదుద్దీన్ ఓవైసీ పై దాడి
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పై రాళ్ళ దాడి జరిగింది. ఆయన గుజరాత్ లో ఎన్నికల ప్రచారం కోసం రైలులో వెళ్తుండగా ఆయన కూర్చున్న కంపార్ట్ మెంట్ పై గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేశారు.
గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం కోసం అహ్మదాబాద్ నుంచి సూరత్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కంపార్ట్‌మెంట్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాళ్లు రువ్వారు. అయితే అసదుద్దీన్ సహా ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఎంఐఎం అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ రైలు కిటికీ పగిలిన చిత్రం ట్వీట్ చేయగా, తాను ప్రయాణిస్తున్న కంపార్ట్‌మెంట్‌పై రాళ్ల దాడి జరిగిందని ఒవైసీ తెలియజేశారు.
గతంలో కూడా ఓవైసీ ఎన్నికల ప్రచారంలో ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 3న ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులుజరిపారు.
आज शाम जब हम @asadowaisi साहब,SabirKabliwala साहब और @aimim_national की टीम अहमदाबाद से सूरत के लिए 'Vande Bharat Express' train में सफर कर रहे थे तब कुछ अज्ञात लोगों ने ट्रेन पर ज़ोर से पत्थर मारकर शीशा तोड़ दिया!#GujaratElections2022 pic.twitter.com/ZwNO2CYrUi
— Waris Pathan (@warispathan) November 7, 2022