Telugu Global
National

కేటీఆర్ తో గొంతు కలిపిన తమిళనాడు సీఎం స్టాలిన్

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం CRPF రిక్రూట్‌మెంట్ పరీక్షల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఇంగ్లీష్, హిందీలో మాత్రమే నిర్వహిస్తారు.

కేటీఆర్ తో గొంతు కలిపిన తమిళనాడు సీఎం స్టాలిన్
X

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) రిక్రూట్‌మెంట్ పరీక్షలను ఇంగ్లీషు, హిందీలో మాత్రమే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ తో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గొంతు కలిపారు.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం CRPF రిక్రూట్‌మెంట్ పరీక్షల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఇంగ్లీష్, హిందీలో మాత్రమే నిర్వహిస్తారు. ఈ రెండు భాషలపై అవగాహన లేని వారికి ఈ నిర్ణయం నష్టం కలిగిస్తోందని , తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో సహా ఇతర అధికారిక భాషల్లో కూడా CRPF రిక్రూట్‌మెంట్ పరీక్ష‌లను నిర్వహించాలని కేటీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రెండు రోజుల క్రితం కోరారు.

ఈ రోజు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నోటిఫికేషన్ తమిళ అభ్యర్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని స్టాలిన్ అన్నారు.

ఇది ఒక హిందీ మాట్లాడే వారికి మాత్రమే ప్రయోజనమని, ఇతరులకు నష్టం కలిగిస్తోందని అందువల్ల తమిళం సహా అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. ఇది ఉద్యోగార్థుల రాజ్యాంగ పరమైన హక్కుకు విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై అమిత్ షా తక్షణమే జోక్యం చేసుకోవాలని స్పష్టం చేశారు.

First Published:  9 April 2023 8:01 PM IST
Next Story