యూపీలో కాంగ్రెస్‌కు 17 సీట్లే.. రాహుల్‌కు అఖిలేష్ ఝలక్
తాము ఇస్తామన్న 17 సీట్లకు కాంగ్రెస్ ఓకే అంటేనే రాయ్‌బరేలిలో రాహుల్‌తో జత కలుస్తానని ఎస్పీ చీఫ్ అఖిలేష్ కుండబద్దలు కొట్టేశారు.
ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ పట్టు కోసం నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఝలక్ ఇచ్చారు. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో కాంగ్రెస్‌కు 17 సీట్లిస్తామని ప్రకటించారు. దానికి ఓకే అంటేనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి తమ రాష్ట్రంలో భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు.
నేడు రాయ్‌బరేలిలో న్యాయ్‌యాత్ర
భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర సోమవారం యూపీలోని అమేఠీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో రాహుల్ ఓడిపోయారు. మంగళవారం ఈ యాత్ర సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీలో జరగనుంది. తాము ఇస్తామన్న 17 సీట్లకు కాంగ్రెస్ ఓకే అంటేనే రాయ్‌బరేలిలో రాహుల్‌తో జత కలుస్తానని ఎస్పీ చీఫ్ అఖిలేష్ కుండబద్దలు కొట్టేశారు.
గత ఎన్నికల్లో ఘోర పరాజయం
గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. 80 స్థానాలకు గాను ఒక్కచోట మాత్రమే గెలిచింది. అది కూడా సోనియా నిలబడిన రాయ్‌బరేలిలో మాత్రమే. రాహుల్ గాంధీ సహా మహామహులంతా ఓడిపోయారు. దీంతో ఈసారి ఎస్పీ, బీఎస్పీలతో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్న కాంగ్రెస్ ఆశలపై ఆ పార్టీల నేతలు నీళ్లు చల్లేస్తున్నారు.