Telugu Global
National

సోనియా గాంధీ తల్లి మృతి.. అంత్యక్రియలు కూడా పూర్తి

సోనియా తల్లి పాలోవా ఈ నెల 27న ఇటలీలో చనిపోయారని, మంగళవారం అంత్యక్రియలు పూర్తయినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ బుధవారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సోనియా గాంధీ తల్లి మృతి.. అంత్యక్రియలు కూడా పూర్తి
X

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తల్లి పాలోవా మయానో మృతి చెందారు. పాలోవా మృతి చెందినట్లు బుధవారం జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. సోనియా గాంధీ కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ విషయంలో స్పందించలేదు. సోనియా తల్లి పాలోవా ఈ నెల 27న ఇటలీలో చనిపోయారని, మంగళవారం అంత్యక్రియలు పూర్తయినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ బుధవారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సోనియా తల్లి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెను పరామర్శించేందుకు సోనియా గాంధీ గత వారమే ఇటలీ వెళ్లారు. సోనియా గాంధీ ఇటీవల రెండుసార్లు కరోనా బారిన పడ్డారు. ఆమెకు కూడా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో విదేశాల్లో చికిత్స చేయించుకోవాలని భావించారు. అదే సమయంలో ఇటలీలో ఉన్న తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకొని ముందుగా ఇటలీ వెళ్లారు. సోనియా వెంట రాహుల్, ప్రియాంకతో పాటు రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు.

సోనియా గాంధీ కుటుంబం అక్కడకు చేరుకున్న తర్వాతే పాలోవా మయానో మృతి చెందినట్లు తెలుస్తున్నది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా జై రాం రమేశ్.. సోనియా తల్లి మరణ వార్తను ధ్రువీకరించారు.

First Published:  31 Aug 2022 6:24 PM IST
Next Story