సోనియా, రాహుల్‌ల విమానం అత్యవసర ల్యాండింగ్
సమావేశం అనంతరం బెంగళూరు నుంచి తిరిగి ఢిల్లీకి బయల్దేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. రాత్రి 7.45 గంటలకు విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
BY Telugu Global19 July 2023 7:43 AM IST
X
Telugu Global Updated On: 19 July 2023 7:43 AM IST
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. బెంగళూరు-ఢిల్లీ విమానం మంగళవారం సాయంత్రం వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో భోపాల్‌లోని రాజాభోజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
బెంగళూరులో జరిగిన 26 ప్రతిపక్ష పార్టీల సమావేశానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హాజరయ్యారు. సమావేశం అనంతరం బెంగళూరు నుంచి తిరిగి ఢిల్లీకి బయల్దేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. రాత్రి 7.45 గంటలకు విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న మాజీ మంత్రి పీసీ శర్మ, ఎమ్మెల్యే కునాల్ చౌదరి సహా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేతలు విమానాశ్రయానికి చేరుకున్నారు.
Next Story