60 ఏళ్ల కిందట ఇందిరా.. ఇప్పుడు సోనియా
జవహర్‌లాల్ నెహ్రూ మరణానంతరం ఆయన వారసురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఇందిరా గాంధీ తొలుత రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరం జరిగారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న ఆమె ఈసారి లోక్‌సభకు పోటీ చేయడం లేదు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఈరోజు ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
అత్త బాటలోనే కోడలు
జవహర్‌లాల్ నెహ్రూ మరణానంతరం ఆయన వారసురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఇందిరా గాంధీ తొలుత రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1964-67 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆమె లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు అత్త బాటలోనే సోనియాగాంధీ పయనిస్తుండటం విశేషం.
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా
1999లో లోక్‌సభకు ఎన్నికైన సోనియా 2004 వరకు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండటంతో అంతా ఆమె కనుసన్నల్లోనే నడిచింది. గత రెండు ఎన్నికల్లోనూ రాయ్‌బరేలి నుంచి ఎంపీగా గెలిచారు.