Telugu Global
National

సర్వేలను మించి కాంగ్రెస్ కి మెజార్టీ.. ఎలా సాధ్యమైంది..?

కర్నాటకలో పీపుల్స్ పల్స్ సంస్థ చేపట్టిన సర్వే నిజమైంది. ప్రీపోల్ సర్వేలోనూ, ఎగ్జిట్ పోల్ సర్వేలోనూ కాంగ్రెస్ దే విజయం అని పీపుల్స్ పల్స్ తేల్చి చెప్పింది. ఇప్పుడు ఆ సర్వే ఫలితాలు నిజమని తేలాయి.

సర్వేలను మించి కాంగ్రెస్ కి మెజార్టీ.. ఎలా సాధ్యమైంది..?
X

కర్నాటక లెక్కలు తేలిపోయాయి. మొత్తం 224 స్థానాల కర్నాటక అసెంబ్లీలో 135 సీట్లు కాంగ్రెస్ కి వచ్చాయి. బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ కి 19 సీట్లు రాగా, ఇతరులు నాలుగుచోట్ల గెలుపొందారు. కర్నాటకలో అధికారానికి అవసరమైన 113 సీట్లకంటే కాంగ్రెస్ కి 22 అధికంగా వచ్చాయి. దీంతో హస్తం పార్టీలో సంబరాలు మొదలయ్యాయి.

అంచనాలను మించి..

కర్నాటక ఎన్నికల నగారా మోగిన తర్వాత వచ్చిన తొలి సర్వేల్లో కాంగ్రెస్ కి కాస్త మొగ్గు ఉందని తేలింది. అయితే కాంగ్రెస్ ఎవరో ఒకరి సపోర్ట్ తో గద్దెనెక్కాల్సిన అవసరం ఉందని సర్వేలు అంచనా వేశాయి. ఆ తర్వాత ప్రీపోల్ సర్వేల్లో కాంగ్రెస్ సీట్లు పెంచుకుంటుందని తేలిపోయింది. ఎగ్జిట్ పోల్స్ సమయానికి గరిష్టంగా కాంగ్రెస్ కి 120 సీట్లు వస్తాయని తేల్చాయి సర్వేలు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్.. సర్వేలను మించి 15 స్థానాలు ఎక్కువగా గెలుచుకుంది. మొత్తం కాంగ్రెస్ కి 135 స్థానాలు వచ్చాయి. హంగ్ కి ఛాన్సే లేకుండా పోగా.. కనీసం కాంగ్రెస్ లో చీలిక తెచ్చే అవకాశం కూడా లేదని తేలిపోయింది.

పీపుల్స్ పల్స్ సర్వే నిజమైంది..

కర్నాటకలో పీపుల్స్ పల్స్ సంస్థ చేపట్టిన సర్వే నిజమైంది. ప్రీపోల్ సర్వేలోనూ, ఎగ్జిట్ పోల్ సర్వేలోనూ కాంగ్రెస్ దే విజయం అని పీపుల్స్ పల్స్ తేల్చి చెప్పింది. ఇప్పుడు ఆ సర్వే ఫలితాలు నిజమని తేలాయి. పీపుల్స్ పల్స్ పట్టుకోవడంలో సర్వే సంస్థ విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ కూాడ షాకయ్యేలా సీట్లలో పెరుగుదల కనపడటం మాత్రం విశేషం.

First Published:  13 May 2023 6:19 PM IST
Next Story