సోనియా, రాహుల్ గాంధీలకు బిగ్‌షాక్..
ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలతోపాటు ప్రస్తుత AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్‌లను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారి స్టేట్‌మెంట్స్ రికార్డు చేసింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు బిగ్ షాక్ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్‌కు సంబంధించిన కేసులో సోనియా, రాహుల్‌కు సంబంధించిన యంగ్ ఇండియాకు చెందిన రూ.90 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. దీంతో పాటు ఈడీ అటాచ్ చేసిన వాటిలో అసోసియేటెడ్ జర్నల్స్‌కు చెందిన ఢిల్లీ, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌస్‌లతో పాటు లక్నోలోని నెహ్రూ భవన్ ఉన్నాయి. అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.752 కోట్లుగా ఉంటుందని సమాచారం.
నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్‌కు ప్రచురణకర్తగా ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సోనియా, రాహుల్ సహా కొందరు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య సంస్థగా ఉంది. యంగ్ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. 2013లో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఫిర్యాదుతో దర్యాప్తు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలతోపాటు ప్రస్తుత AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్‌లను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారి స్టేట్‌మెంట్స్ రికార్డు చేసింది. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల ఈ కేసు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇప్పటికే దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.