Telugu Global
National

మోడీకి షాక్: బీబీసీ డాక్యుమెంటరీ నిషేధాన్ని వ్యతిరేకి‍ంచిన అమెరికా

రెగ్యులర్ ప్రెస్ బ్రీఫింగ్‌లో ప్రసంగిస్తూ, US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్, ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్చ, భావప్రకటనా స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య సూత్రాలకు అమెరికా మద్దతు ఇస్తుందని అన్నారు. భారత దేశంలో కూడా ఇది కొనసాగాలని ప్రైస్ పేర్కొన్నారు.

మోడీకి షాక్: బీబీసీ డాక్యుమెంటరీ నిషేధాన్ని వ్యతిరేకి‍ంచిన అమెరికా
X

గుజరాత్ అల్లర్లపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ పై వివాదం కొనసాగుతోంది. ఆ డాక్యుమెంటరీని భారత్ నిషేధించింది. అయితే ఈ నిషేధాన్ని అమెరికా వ్యతిరేకించింది. ఇది మీడియా స్వేచ్చకు సంబంధించిన అంశం అని US స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

జనవరి 25, బుధవారం రెగ్యులర్ ప్రెస్ బ్రీఫింగ్‌లో ప్రసంగిస్తూ, US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్, ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్చ, భావప్రకటనా స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య సూత్రాలకు అమెరికా మద్దతు ఇస్తుందని అన్నారు. భారత దేశంలో కూడా ఇది కొనసాగాలని ప్రైస్ పేర్కొన్నారు.

"మేము ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను సమర్ధిస్తాము. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి దోహదపడే మానవ హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, మతం లేదా విశ్వాసం స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య సూత్రాల ప్రాముఖ్యతను మేము నొక్కి చెప్పదల్చుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో మాకున్న సంబంధాలలో ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఖచ్చితంగా భారతదేశంతో మాకున్న సంబంధంలో కూడా వర్తింస్తుంది. ”అని ఆయన మీడియాతో అన్నారు.

బీబీసీ డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని పేర్కొన్న రెండు రోజుల తర్వాత ప్రైస్ ఈ మాటలు మాట్లాడటం గమనార్హం. "మీరు ప్రస్తావిస్తున్న డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు, అయినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్, భారతదేశం...ఈ రెండు అభివృద్ధి చెందుతున్న, శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలు. ఈ దేశాలు అమలు చేసే విలువలు నాకు బాగా తెలుసు" అని ఆయన జనవరి 23న విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

కాగా "ఇండియా: ది మోడీ క్వశ్చన్" అనే డాక్యుమెంటరీని BBC గత వారం విడుదల చేసింది. ఇందులో గుజరాత్ అల్లర్ల‌లో అప్పటి ముఖ్యమంత్రి నరేందర్ మోడీ పాత్ర గురించి పేర్కొంది. ఈ డాక్యుమెంటరీని భారత్ నిషేధించింది.

First Published:  26 Jan 2023 4:34 PM IST
Next Story