థరూర్ ఇకపై అస్మదీయుడా..? తస్మదీయుడా..?
కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉందని చెప్పడానికి ఈ ఎన్నికే ఒక ఉదాహరణ. అయితే ఇప్పుడు థరూర్ పరిస్థితి ఏంటనేదే ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం థరూర్‌ని మునుపటిలా ఆదరిస్తుందా, లేక దూరం పెడుతుందా అనేది వేచి చూడాలి.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలొచ్చాయి. అధిష్టానం అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే విజేతగా నిలిచారు. మరి అధిష్టానం అభ్యర్థి ఖర్గేకి వ్యతిరేకంగా పోటీ చేసిన శశిథరూర్ పరిస్థితి ఏంటి..? అధినాయకత్వంతో ఆయన మునుపటిలా సఖ్యతతో ఉండగలరా..? పార్టీ నేతలు ఆయనకు మునుపటిలా గౌరవం ఇస్తారా..? లేదా స్వపక్షంలో విపక్షంలా అవకాశం కోసం థరూర్ ఎదురు చూడాల్సిందేనా..?
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల విషయంలో అధిష్టానం ముందుగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కి అవకాశం ఇవ్వాలనుకుంది. ఆ పని చేస్తే రాజస్థాన్‌లో ప్రభుత్వం పడిపోతుందనే అనుమానంతో ఖర్గేని బరిలో దింపింది. అయితే శశిథరూర్ మాత్రం తగ్గేది లేదంటూ పోటీలో దిగారు. ఓ దశలో కాంగ్రెస్‌ని ప్రక్షాళణ చేయాల్సిన అవసరం వచ్చిందని, ఇక ఆలస్యం చేయకూడదని ప్రచారంలో చెప్పుకొచ్చారు థరూర్. అంటే అధిష్టానాన్ని ఆయన ధిక్కరించినట్టే లెక్క. కానీ ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో కీలకం కాబట్టి ఆయనకు ఆ హక్కు ఉంది, ఆ హక్కుని కాదనే అధికారం కాంగ్రెస్ అధిష్టానానికి కూడా లేదు. ఒకరకంగా కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉందని చెప్పడానికి ఈ ఎన్నికే ఒక ఉదాహరణ.
అయితే ఇప్పుడు థరూర్ పరిస్థితి ఏంటనేదే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆయన తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా మూడోసారి ఆయన అక్కడ ఎంపీగా గెలిచారు. స్థానికంగా ఆయనకు మంచి పేరుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌తో ఆయన సంబంధం ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. పార్టీలో మార్పులు చేర్పులు అవసరం, అది తన ఆధ్వర్యంలోనే సాధ్యం అంటున్న శశిథరూర్ ముందు ముందు పార్టీతో కలసి నడవగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే సమయంలో రిగ్గింగ్ అంటూ సంచలన ఆరోపణలు చేసింది థరూర్ వర్గం, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. కానీ ఫలితాల తర్వాత మాత్రం సర్దుకుపోయారు థరూర్. పోలైన 9500 ఓట్లలో థరూర్‌కి 1072 మంది మద్దతు తెలపడం కూడా విశేషమే. ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్లో స్పందించిన థరూర్, ఖర్గేకు అభినందనలు తెలిపారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెంట ఉండి నడిపిన సోనియాకు ధన్యవాదాలని, అధ్యక్ష ఎన్నికలు తటస్థంగా జరిగేలా చూసిన రాహుల్, ప్రియాంకలకు కూడా ధన్యవాదాలు అని చెప్పారు థరూర్. అంటే థరూర్ సర్దుకుపోయినట్టేనని అంటున్నారు కొంతమంది. కాంగ్రెస్ అధిష్టానం