Telugu Global
National

ఎన్నికల షెడ్యూల్‌ ఎవరు రెడీ చేశారో ఊహించండి చూద్దాం – రాజ్‌దీప్‌ ఎద్దేవా

ఎన్నికల షెడ్యూల్‌ మాత్రమే ప్రకటించడం మిగిలిందని.. ఇప్పుడు ఈసీ ఆ పని కూడా పూర్తి చేసిందని కామెంట్‌ చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఎవరు రూపొందించారో ఇక మీరే ఊహించండి అంటూ ట్వీట్‌ చేశారు.

ఎన్నికల షెడ్యూల్‌ ఎవరు రెడీ చేశారో ఊహించండి చూద్దాం – రాజ్‌దీప్‌ ఎద్దేవా
X

గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌పై సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ సెటైర్లు వేశారు. ఈ ఎన్నికల షెడ్యూల్‌ వెనుక బీజేపీ ఉందన్న అర్థమొచ్చేలా ఆయన ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలన్నీ పూర్తయ్యాయి. రిబ్బన్‌ కటింగ్‌లు, భూమిపూజలు జరిగిపోయాయి.

ఎన్నికల హామీలు కూడా ఇచ్చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ మాత్రమే ప్రకటించడం మిగిలిందని.. ఇప్పుడు ఈసీ ఆ పని కూడా పూర్తి చేసిందని కామెంట్‌ చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఎవరు రూపొందించారో ఇక మీరే ఊహించండి అంటూ ట్వీట్‌ చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ పెద్దల కనుసన్నల్లోనే పనిచేస్తోందని పరోక్షంగా రాజ్‌దీప్‌ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లో బీజేపీ ఎన్నికలకు అంతా సిద్ధం చేసుకున్న తర్వాతనే షెడ్యూల్‌ విడుదలైందన్న భావన కలిగించారు.

First Published:  4 Nov 2022 9:14 AM IST
Next Story