ఇలాంటివారి మధ్య పనిచేస్తున్నామా?.. సీనియర్ నటి ఊర్వశి కీలక వ్యాఖ్యలు
కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అందులో పేర్కొంది. ఇది ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ గురించి విని షాకయ్యా.. ఇలాంటి వారి మధ్య వర్క్ చేస్తున్నామని తెలిసి భయమేసింది.. అంటూ సీనియర్ నటి ఊర్వశి వ్యాఖ్యానించారు. మాలీవుడ్‌లో మహిళలపై వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై తాజాగా స్పందించిన ఊర్వశి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని పరిశ్రమల్లోనూ ఉన్నాయన్నారు. మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు తాను సపోర్ట్ చేస్తున్నట్టు తెలిపిన ఆమె.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలు పడాలని చెప్పారు. ప్రభుత్వం త్వరితగతిన దీనిపై స్పందించి మహిళల సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఆ రోజుల్లో తాను స్టార్ హీరోయిన్‌గా కొనసాగానని, తాను వ్యక్తిగతంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కోలేదని సీనియర్ నటి ఊర్వశి చెప్పారు. అప్పట్లో తన తల్లిదండ్రులు సైతం ప్రతిక్షణం తనకు సంబంధించిన విషయాలను చెక్ చేస్తుండేవారని ఆమె తెలిపారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే చాలామంది నటీమణులు లైంగిక వేధింపులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పారు. తనలాంటి ఎంతోమంది మహిళలు జీవనోపాధి కోసం సినిమాల్లో వర్క్ చేస్తున్నారని, నటీనటులు కలిసి వర్క్ చేసినప్పుడే మంచి చిత్రాలను తెరకెక్కించగలుగుతామని ఆమె వివరించారు. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ మళ్లీ రిపీట్ కాకూడదన్నారు. ఈ విషయంలో బాధిత మహిళలకే తన మద్దతు అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం త్వరితగతిన దీనిపై స్పందించి మహిళల సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఈ నివేదికను ప్రభుత్వానికి అందించింది. దాదాపు ఏడేళ్ల పాటు వర్క్ చేసి ఈ నివేదికను సిద్ధం చేసింది. కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అందులో పేర్కొంది. ఇది ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.