బీఆర్ఎస్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ పార్టీ విలీనం
సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం పార్టీ అధ్యక్షుడు బాబా సాహెబ్ షెల్కే, ఉపాధ్యక్షుడు బాల్ భీమ్ రావు చవాన్, సీనియర్ నాయకుడు సుభాష్ బోరికర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని దేశమంతా విస్తరించే క్రమంలో అనేక చిన్న పార్టీలు విలీనం అవుతాయని గతంలోనే అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చెప్పారు. దేశమంతా పార్టీ విస్తరించాలంటే తప్పకుండా విలీనాలు కూడా ఉంటాయని, వీటిపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ నెల 24న చత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్)లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సభా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో అనేక మంది స్థానిక నాయకులను ఆయన కలుస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తుండటంతో చాలా మంది పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. అనేక మందికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం పార్టీ అధ్యక్షుడు బాబా సాహెబ్ షెల్కే, ఉపాధ్యక్షుడు బాల్ భీమ్ రావు చవాన్, సీనియర్ నాయకుడు సుభాష్ బోరికర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఇవాళ ఉదయం ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో సమావేశం అయిన పార్టీ ముఖ్యులు.. చర్చల అనంతరం పార్టీని విలీనం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూశామని.. మహారాష్ట్రలో కూడా అలాంటి పథకాలు ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ ప్రతినిధులు తెలిపారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి తాము బీఆర్ఎస్‌లో విలీనం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో అలాంటి పథకాలు అమలు చేయడం కేవలం బీఆర్ఎస్, కేసీఆర్ వల్లే సాధ్యం అవుతుందని నమ్ముతున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. తమ పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు అన్నీ బీఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు దగ్గరగా ఉండటం వల్లే పార్టీని విలీనం చేశామని అన్నారు. ఈ నెల 24న జరిగే సభను విజయవంతం చేయడానికి తాము కూడా కృషి చేస్తామని పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ పార్టీ తమ పూర్తి మద్దతు BRS పార్టీకే అని తమ పార్టీని BRS పార్టీలో విలీనం చేసి పార్టీ సభ్యులు BRS పార్టీ లో చేరారు.
— Jeevan Reddy MLA (@JeevanreddyBRS) April 22, 2023
చేరిన వారిలో బాబా సాహెబ్ షెల్కే (అధ్యక్షులు),ప్రొఫెసర్ బల్ భీమ్ రావు చవాన్ ( ఉపాధ్యక్షులు) మరియ కార్యకర్తలు చేరారు pic.twitter.com/JPkLuX1lEw