Telugu Global
National

అంకిత భండారీపై ఆర్ఎస్ఎస్ నేత అభ్యంతర వ్యాఖ్య‌లు.. కేసు న‌మోదు

19 ఏళ్ల అంకిత భండారీని "ఆకలితో ఉన్న మగ పిల్లుల ముందు పచ్చి పాలు" అని విపిన్ అభివర్ణించాడు. ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యాయి. అమాయ‌కురాలైన ఓ ఆడ‌పిల్ల‌ను అవ‌మానించేలా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయని విమ‌ర్శ‌లు చెల‌రేగాయి

అంకిత భండారీపై ఆర్ఎస్ఎస్ నేత అభ్యంతర వ్యాఖ్య‌లు.. కేసు న‌మోదు
X

ఉత్త‌రాఖండ్ లో బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్య నిర్వ‌హిస్తున్న రిసార్టులో రిసెప్ష‌నిస్టుగా ప‌నిచేస్తున్న అంకిత భండారీ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. కాగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నాయకుడు విపిన్ కర్న్‌వాల్ అంకిత‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఉత్త‌రాఖండ్ పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు.

19 ఏళ్ల అంకిత భండారీని "ఆకలితో ఉన్న మగ పిల్లుల ముందు పచ్చి పాలు" అని విపిన్ అభివర్ణించాడు. ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యాయి. అమాయ‌కురాలైన ఓ ఆడ‌పిల్ల‌ను అవ‌మానించేలా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయని విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. ఆర్ఎస్ఎస్ నేత వ్యాఖ్య‌లు సమాజంలో శత్రుత్వం, ఉద్రిక్తతలను వ్యాప్తి చేసేవిగానూ, మహిళల‌ను అవమానించే విధంగా ఉన్నందున కేసు నమోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. డెహ్రాడూన్‌లోని రైవాలా పోలీస్ స్టేషన్‌లో విప‌న్‌పై ఈ కేసు న‌మోదైంది.

అంకిత హ‌త్య‌కు ఆమె తండ్రిని నిందిస్తూ విపిన్‌ త‌న ఫేస్ బుక్‌లో "ఆకలితో ఉన్న మగ పిల్లుల ముందు పచ్చి పాలను ఉంచిన‌ పెద్ద అపరాధి ఆమె తండ్రి" అని పోస్టు పెట్టి త‌రువాత తీసేశాడు. ఆ రిసార్టులో వ్య‌భిచారం జ‌రుగుతుంద‌నే విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అటువంటి చోట‌కు త‌న‌ 19 ఏళ్ళ ఆడ‌పిల్ల‌ను ఉద్యోగానికి పంపి ఆమె సంపాద‌న‌ను తింటున్న ఆమె తండ్రి తోబుట్టువులు అస‌లైన నేర‌స్థులు. ఎవరు ఆకలితో ఉన్న పిల్లుల ముందు పచ్చి పాలను ఉంచుతారు" అని విపిన్ త‌న ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నాడు.

విజయ్‌పాల్ రావత్ అనే ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడిపై కేసు న‌మోదు చేశారు. స‌మాజంలో వివిధ వ‌ర్గాల మ‌ధ్య శత్రుత్వాన్ని పెంచ‌డం, సామ‌ర‌స్యానికి విఘాతం క‌లిగించ‌డం, ప్ర‌జ‌ల్లో అల‌జ‌డికి దారి తీసేవిధంగా ఉండే ప్ర‌క‌ట‌న‌లు చేసినందుకు, మ‌హిళ‌ల‌ను అవ‌మానించేలా వ్యాఖ్య‌లు చేసినందుకు సంబంధిత సెక్ష‌న్ల ఆధారంగా కేసు న‌మోదు చేశారు. ఆర్ఎస్ఎస్ నాయ‌కుడు కర్న్‌వాల్ కోసం గాలిస్తున్నామ‌ని రిషికేశ్ డిప్యూటీ కమిషనర్ దొంధియాల్ తెలిపారు.

First Published:  29 Sept 2022 7:22 PM IST
Next Story