Telugu Global
National

RRR అంటే రోడ్డుపై రెడ్ లైట్ కు రెస్పెక్ట్ ఇవ్వండి....నాటు నాటు పాటకు యూపీ పోలీసుల వెరైటీ ట్విస్ట్

యూపీ పోలీసులు చేసిన ట్వీట్ లో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గెల్చుకున్నందుకు RRR టీంకి అభినందనలు తెలుపుతూనే ప్రజలకు "రోడ్డు భద్రత యొక్క గోల్డెన్ గ్లోబల్ రూల్స్" గురించి కూడా వివరిస్తుంది.

RRR Movie: పఠాన్ కు పోటీగా ఆర్ఆర్ఆర్
X

RRR Movie: పఠాన్ కు పోటీగా ఆర్ఆర్ఆర్

‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్స్ 2023 అవార్డును గెలుచుకున్న సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కి ఉత్తరప్రదేశ్ పోలీసుల అభినందన సందేశం వైరల్‌గా మారింది.

యూపీ పోలీసులు చేసిన ట్వీట్ లో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గెల్చుకున్నందుకు RRR టీంకి అభినందనలు తెలుపుతూనే ప్రజలకు "రోడ్డు భద్రత యొక్క గోల్డెన్ గ్లోబల్ రూల్స్" గురించి కూడా వివరిస్తుంది.

RRR అంటే 'రెస్పెక్ట్ ది రెడ్ లైట్ ఆన్ ది రోడ్' (రోడ్డుపై రెడ్ లైట్‌ను గౌరవించండి)అనే అర్దాన్ని చెప్పారు యూపీ పోలీసులు

గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకున్న RRR మూవీలోని నాటు నాటు పాటపై సృజనాత్మకంగా స్పందించారు పోలీసులు.

గోల్డెన్ గ్లోబ్ రోడ్ సేఫ్టీ నియమాలకు నామినేషన్లు ;

#Naatu,కభీ రెడ్ లైట్ స్కిప్ కరే( ఎప్పుడైనా రెడ్ లైట్ జంప్ చేస్తే)

#Naatu,కభీ ట్రిప్లింగ్ కరే ( ఎప్పుడైనా త్రిబుల్ రైడింగ్ చేస్తే)

#Naatu,కభీ డ్రంకెన్ డ్రైవింగ్ కరే (తాగిగు డ్రైవింగ్ చేస్తే)

#Naatu,కభీ ట్రాఫిక్ రూల్స్ తోడే ( ట్రాఫిక్ రూల్స్ ను ధిక్కరిస్తే) అని ట్వీట్ చేశారు యూపీ పోలీసులు

ఈ ట్వీట్‌కి 42,000 వ్యూస్ వచ్చాయి. 366 మంది రీ ట్వీట్ చేశారు. నెటిజనులు యూపీ పోలీసుల క్రియేటివిటీని ప్రశంసిస్తున్నారు.

ఇలా సినిమాలను ఉపయోగించుకొని ట్రాఫిక్ రూల్స్ గురించి, నేరాల గురించి, చట్టాల గురించి ప్రజలకు చెప్పడం యూపీ పోలీసులు ఇది మొదటి సారి కాదు.

యూపీ సోషల్ మీడియా సెంటర్ ఇన్‌ఛార్జ్ అదనపు ఎస్పీ రాహుల్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, “సినిమా, క్రీడలు మొదలైన వాటిలో కొత్త ట్రెండ్ లను యూపీ పోలీసులు ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటారు. ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం మేమెప్పుడూ జనాదరణ పొందిన సినిమాలు, పాటలకు చమత్కారమైన ట్విస్ట్ లు ఇస్తూ ప్రజలను ఆకట్టుకుంటూ ఉంటాం'' అని చెప్పారు.


First Published:  13 Jan 2023 12:50 PM IST
Next Story