Telugu Global
National

వాలంటైన్స్ డే.. ఈసారి గులాబీ మొక్కలకు యమా డిమాండ్

గులాబీ మొక్కల పెంపకానికి ప్రసిద్ది పొందిన కర్నాటకలోని అగళకోట ప్రాంతంలోని నర్సరీలలో రోజా మొక్కలకు డిమాండ్‌ పెరిగింది. ఈ ఏడాది ప్రేమికుల రోజుకోసం 10 లక్షల గులాబీ మొక్కలకు ఆర్డర్లు ఇచ్చారట.

వాలంటైన్స్ డే.. ఈసారి గులాబీ మొక్కలకు యమా డిమాండ్
X

కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగిపోయిన వేళ ఈ ఏడాది వాలంటైన్స్ డే ని ఓ రేంజ్ లో జరుపుకోడానికి ప్రేమికులు సిద్ధమయ్యారు. చాట్ జీపీటీ సాయంతో రాస్తున్న ప్రేమ లేఖలు కూడా 2023 స్పెషల్. ఇక ఈ ఏడాది ప్రేమికులు గులాబీ పువ్వులకు బదులు, గులాబీ మొక్కలు ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట. ఇది కూడా ఈ ఏడాది కొత్తగా కనిపించబోతున్న ట్రెండ్.

ప్రేమికుల రోజు ఒక్క రోజా పువ్వు ఇస్తే రెండో రోజుకు వాడిపోతుందని, ప్రేమ నిలకడగా ఉండాలని ఆశిస్తూ కొంత మంది ప్రేమికులు తమ ప్రేయసికి గులాబీ మొక్కలు ఇవ్వాలనుకుంటున్నారట. గులాబీ మొక్కల పెంపకానికి ప్రసిద్ది పొందిన కర్నాటకలోని అగళకోట ప్రాంతంలోని నర్సరీలలో రోజా మొక్కలకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం నర్సరీలలో రోజా మొక్కలకు ముందే ఆర్డర్లు ఇవ్వడంతో మిగతావారికి దొరకడం కష్టంగా ఉంది. ఈ ఏడాది ప్రేమికుల రోజుకోసం 10 లక్షల గులాబీ మొక్కలకు ఆర్డర్లు ఇచ్చారట.

పువ్వులకూ డిమాండ్..

ఈ ఏడాది కొత్తగా గులాబీ మొక్కలకు డిమాండ్ పెరిగినా, పువ్వులకు కూడా ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉందని అంటున్నారు కర్నాటకలోని నర్సరీల నిర్వాహకులు. ప్రేమికుల రోజు అంటే కర్నాటకలో ప్రత్యేకంగా హోసూరు గులాబీలకు రెక్కలు వస్తాయి. ప్రపంచం నలుమూలలకూ గులాబీలు ఇక్కడినుంచి ఎగుమతి అవుతుంటాయి. ఈసారి 25 లక్షల గులాబీ పూలకోసం హోసూరు నర్సరీ నిర్వాహకులకు ఆర్డర్లు వచ్చాయి. హోసూరు, క్రిష్ణగిరి ప్రాంతంలో గులాబీ, ఇతర పువ్వుల సాగుకు అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండడంతో పెద్దఎత్తున రైతులు గ్రీన్‌ షెడ్లు ఏర్పాటు చేసి జరబరా, రోజా, కార్నేషన్‌ తదితర పూల తోటలను పెంచుతున్నారు.

వాలెంటైన్స్‌ డే కి హోసూరు ప్రాంతం నుంచి ప్రతి ఏడాది.. ఆ్రస్టేలియా, దుబాయ్, ఇంగ్లండ్, సింగపూర్, అమెరికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఒక్కో పువ్వు ధర రూ. 20 నుంచి రూ. 22 దాకా పలుకుతుందని వ్యాపారులు చెబుతున్నారు. గులాబీ మొక్క ధర 100 రూపాయలనుంచి మొదలవుతుంది.

First Published:  13 Feb 2023 3:12 PM IST
Next Story