నేడు రాహుల్ గాంధీతో రేవంత్, కాంగ్రెస్ నేతల భేటీ
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం కానున్న నాయకులు
![నేడు రాహుల్ గాంధీతో రేవంత్, కాంగ్రెస్ నేతల భేటీ నేడు రాహుల్ గాంధీతో రేవంత్, కాంగ్రెస్ నేతల భేటీ](https://www.teluguglobal.com/h-upload/2025/02/07/1401138-rahul-kharge.webp)
తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. గురువారం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో చర్చించిన అంశాలను పార్టీ పెద్దలకు వివరించనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. రాత్రి పొద్దుపోయే వరకు ఈ సమావేశం కొనసాగింది. శుక్రవారం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమవుతారు. ఇటీవల కాలంలో జరిగిన అన్ని పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఆయా అంశాలపై తీసుకున్న నిర్ణయాలను పార్టీ పెద్దలకు వివరిస్తారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలపైనా చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సూర్యాపేట, మెదక్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలకు రావాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించనున్నారు. రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాలేదని.. పార్లమెంట్ ఆవరణలోని తన చాంబర్‌లో రాహుల్ వీరితో భేటీ అవుతారా.. సమావేశం వాయిదా పడిన తర్వాత కలుస్తారా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.