'జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ'
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కేంద్రం పక్కా ప్రణాళికలను రూపొందిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వెల్లడించారు. జమ్ము కశ్మీర్ కు ఉన్న రాష్ట్ర హోదాను మూడేళ్ళ క్రితం కేంద్ర బీజేపీ సర్కార్ రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది.
దశాబ్దాలుగా కల్లోలిత ప్రాంతంగా ఉన్న, ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్ కు మూడేళ్ళ క్రితం రద్దు చేసిన రాష్ట్ర హోదాను పునరుద్ధరంచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
భారతదేశంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి దాని రెండవ ప్రధాన నిర్ణయం అయిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కేంద్రం పక్కా ప్రణాళికలను రూపొందిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వెల్లడించారు.
"కోఆపరేటివ్ ఫెడరలిజం: ఆత్మ నిర్భర్ భారత్ వైపు మార్గం" అనే అంశంపై మాట్లాడుతూ సీతారామన్ సూచనప్రాయంగా ఈ విషయం తెలిపారు. కొంత సమయం పట్టినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా పునరుద్దరణ జరుగుతుందన్నారు.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం - భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రాజకీయ పార్టీలు దీనిపై నిరసనలు తెలుపుతున్నారు. 2023లో జరగనున్న ఎన్నికల్లో ప్రతీ పార్టీ ఎజెండాలో ప్రముఖంగా ఈ అంశం ప్రస్తావిస్తున్నారు. ఈ వ్యతిరేకతను తట్టుకునేందుకే కేంద్రం తన ఆలోచన ఉపసంహరించుకుని రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2018 నుండి జమ్మూ కాశ్మీర్‌లో సరైన ప్రభుత్వం లేకపోవడం గమనార్హం.
ఇటీవల, మాజీ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కూడా తాను అధికారంలోకి వస్తే జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించే దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఇందుకోసం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సంప్రదిస్తానని అన్నారు.