Telugu Global
National

రాజస్థాన్ లో రాజీనామాల రాజకీయం... గెహ్లాట్,పైలట్ లకు సోనియా పిలుపు

రాజస్థాన్ లో 92 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్దమవడంతో ఆ పార్టీ అధినాయకత్వం షాక్ కు గురయ్యింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ లను ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశించారు.

రాజస్థాన్ లో రాజీనామాల రాజకీయం... గెహ్లాట్,పైలట్ లకు సోనియా పిలుపు
X

రాజస్థాన్‌లో జరిగిన రాజకీయ డ్రామాతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కలత చెందింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మద్దతుదారులు ఆదివారం సచిన్ పైలట్‌కు వ్యతిరేకంగా ఏక‌మై రాజీనామాలకు సిద్ధ‌ప‌డ్డారు. ఉంటే గెహ్లాట్ ఉండాలి లేదా ఆయ‌న సూచించిన వ్య‌క్తే ముఖ్య‌మంత్రిగా ఉండాలి త‌ప్ప పైల‌ట్ అయ్యేందుకు వీలు లేద‌ని తేల్చి చెప్పారు.

దీంతో గెహ్లాట్ కూడా తానేమీ చేయ‌లేన‌ని, త‌న చేతుల్లో ఏమీ లేద‌ని, మ్మెల్యేలే నిర్ణ‌యించుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యేలంతా ఆగ్ర‌హంగా ఉన్నార‌ని చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న అగ్ర‌నాయ‌క‌త్వానికి స‌న్నిహితుడైన కె.సి వేణుగోపాల్ కు పోన్ ద్వారా తెలియ‌జేసార‌ని స‌మాచారం. అయితే త‌న‌కు గెహ్లాట్ ఫోన్ చేయ‌డం కానీ తాను ఆయ‌న‌తో మాట్లాడ‌డం కానీ చేయ‌లేద‌ని వేణుగోపాల్ అన్నారు. కాగా తాజా ప‌రిణామాల‌తో ఖంగు తిన్న అధిష్ఠానం గెహ్లాట్‌, స‌చిన్ పైల‌ట్ ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆదివారం నాడు జ‌రిగిన అనూహ్య‌ ప‌రిణామాల్లో గెహ్లాట్‌కు గట్టి మద్దతుదారులైన దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో సమావేశమయ్యారు, పైలట్‌ను రేసు నుండి తప్పించే వ్యూహాన్ని రచించారు. గెహ్లాట్ వారసుడి ఎంపికపై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చించార‌ని స‌మాచారం. రాష్ట్ర మంత్రి ప్రతాప్ ఖచ్రియావాస్ మ ఆట్లాడుతూ 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. త‌మ‌ నాయకుడిని ఎన్నుకునే హక్కు త‌మ‌కు ఉందని, త‌మ నాయకుడిని తామే నిర్ణయిస్తామని ఆయన అన్నారు. దీంతో పైల‌ట్ కు ప‌గ్గాలు అంద‌డంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గెహ్లాట్ రాజీనామాతో రాజస్థాన్‌లో కొంత వ్యతిరేకత రావ‌చ్చ‌ని కాంగ్రెస్ అధిష్టానం ఊహించింది కానీ ఇంత తీవ్ర స్థాయిలో అసమ్మతి వ‌స్తుంద‌ని ఊహించి ఉండలేదు. ఎమ్మెల్యేలను తప్పుదోవ పట్టించారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.

First Published:  26 Sept 2022 3:01 AM GMT
Next Story