రేణుకా స్వామి హత్య కేసు.. హీరో దర్శన్ లాయర్ కీలక విషయాలు
అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కోర్టుకు హీరో దర్శన్ తరఫు లాయర్ కీలక విషయాలు వెల్లడించారు.
అభిమాని మర్డర్ కేసులో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్ మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దర్శన్‌కు పూర్తిస్థాయి బెయిల్ మంజురు చేయాలని ఆయన తరుపున న్యాయవాది సీవీ నగేష్ కర్ణాటక హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. రేణుకా స్వామికి మహిళలంటే గౌరవం లేదు. గౌతమ్ అనే పేరుతో పవిత్ర గౌడతో పాటు మరికొందరు మహిళలకు తరచూ న్యూడ్ ఫొటోస్ పంపి వేధించేవాడని లాయర్ పేర్కొన్నారు.
అతడు సమాజానికి ముప్పుగా మారాడని అలాంటి వ్యక్తిని హీరోగా చిత్రకరించి, దర్శన్ విలన్‌గా దుమ్మెత్తిపోస్తున్నారని న్యాయవాది తెలిపారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడ సహా 16మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో దర్శన్ అండ్ టీం రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిందని విచారణలో తేలింది. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు ఇచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది