జార్ఖండ్ సీఎం కు సుప్రీం కోర్టులో ఊరట
మైనింగ్ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్‌పై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్)హైకోర్టు విచారణ జరపడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఆ పిల్ లకు విచారణ అర్హత లేదని ఈ రోజు సుప్రీం కోర్టు తెల్చి చెప్పింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీం కోర్టు భారీ ఊరటనిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో తనపై జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారణకు అనుమతించింది. మైనింగ్ కుంభకోణం కేసులో సోరెన్‌పై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్)హైకోర్టు విచారణ నిర్వహించింది. అయితే ఇప్పుడు ఆ పిల్ లు విచారణార్హమైనవి కావని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
" జార్ఖండ్ హైకోర్టు జారీ చేసిన జూన్ 3, 2022 ఆర్డర్‌ను మేము పక్కన పెట్టాము, ఈ PIL లు నిర్వహించదగినవి కావు" అని బెంచ్ తెలిపింది.
హేమంత్ సోరెన్ ట్విట్టర్‌లో "సత్యమేవ జయతే! (సత్యమే గెలుస్తుంది)" అనే సందేశంతో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు.
2021లో పదవిలో ఉండగా తనకు తాను మైనింగ్ లీజు మంజూరు చేసుకున్నందుకు సోరేన్ పై బిజెపి ఫిర్యాదు నేపథ్యంలో ఆయనపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘం గవర్నర్ రమేష్ బైస్‌కు సిఫార్సు చేసినట్లు సమాచారం.అయితే గవర్నర్ ఆ నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జూలైలో దాడులు చేసి ముఖ్యమంత్రి సహాయకుడు పంకజ్ మిశ్రా బ్యాంక్ ఖాతాల నుండి ₹ 11.88 కోట్లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ కేసులో మరో ఇద్దరిని గతంలో అరెస్టు చేసింది. మిశ్రా ఇంటి నుంచి ₹ 5.34 కోట్ల లెక్కల్లో చూపని నగదును కనుగొన్నట్లు ఏజెన్సీ పేర్కొంది. మూడు నెలల క్రితం సోరెన్ ప్రెస్ అడ్వైజర్ అభిషేక్ ప్రసాద్‌ని కూడా ED ప్రశ్నించింది.
ఆ సమయంలోనే హేమంత్ సోరెన్ ''నేనే దోషి అయితే నన్ను అరెస్ట్ చేయండి'' అని కేంద్ర దర్యాప్తు ఈడీ కి సవాల్ విసిరారు.
"ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నికైన జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కేంద్రసంస్థలను ప్రయోగించింది. ఈడీ, సీబీఐలకు నేను భయపడను.. తమను వ్యతిరేకించే ఎవరి గొంతునైనా అణిచివేసేందుకు ఇది రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోంది'' అని సోరెన్ అన్నారు.
सत्यमेव जयते! pic.twitter.com/38JLdRLmsq
— Hemant Soren (@HemantSorenJMM) November 7, 2022