Telugu Global
National

ఎగ్జిట్‌ పోల్స్‌పై నిబంధనలు పాటించాల్సిందే.. - ఈసీ ఆదేశాలు

ఇప్పటికే 6 దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. శనివారంతో చివరిదైన ఏడో విడత పోలింగ్‌ కూడా జరగనుంది. వీటికి సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ఎన్నికల కమిషన్‌ బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే.

ఎగ్జిట్‌ పోల్స్‌పై నిబంధనలు పాటించాల్సిందే.. - ఈసీ ఆదేశాలు
X

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ శనివారం జరిగే ఏడో విడత పోలింగ్‌తో ముగియనుంది. దీంతో శనివారం సాయంత్రమే ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ తాజాగా దీనిపై ఆదేశాలు విడుదల చేసింది. జూన్‌ ఒకటో తేదీ శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేయాలని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాల్సిందేనని ఈసీ పేర్కొంది.

ఇప్పటికే 6 దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. శనివారంతో చివరిదైన ఏడో విడత పోలింగ్‌ కూడా జరగనుంది. వీటికి సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ఎన్నికల కమిషన్‌ బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. పోలింగ్‌ ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగిసిన తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు వెల్లడించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్లకు మార్చి 28వ తేదీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈసీ స్పష్టంగా పేర్కొంది.

First Published:  1 Jun 2024 7:49 AM IST
Next Story