రియల్ లైఫ్ 'లవ్ టుడే' : పెళ్లికి ముందు ఫోన్లు మార్చుకుని జైలు పాలైన యువకుడు
ఇలా ఫోన్లు మార్చుకున్న తర్వాత యువతి అరవింద్ మొబైల్ ని చెక్ చేస్తుండగా ఓ బాలిక న్యూడ్ వీడియో కనిపించింది. బంధువుల సహాయంతో ఆ వీడియోలో ఉన్న బాధితురాలి వివరాలు సేకరించింది.
తమిళనాడులో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మూవీ `లవ్ టుడే`. ఈ సినిమాలో ప్రేమికులు ఒకరి గురించి మరొకరు తెలుసుకునేందుకు తమ సెల్‌ఫోన్లను ఒకరినొకరు మార్చుకుంటారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తాయి.. వాటిని ఆ జంట ఏ విధంగా పరిష్కరించుకుంది అన్నదే కథ. అయితే ఈ సినిమా నిజ జీవితంలో కూడా చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడులో చాలామంది పెళ్లికి ముందు ఒకరినొకరు తెలుసుకునేందుకు సెల్ ఫోన్లు మార్చుకుంటున్నారు.
ఇలా ఓ జంట సెల్ ఫోన్లు మార్చుకోగా అబ్బాయి సెల్ ఫోన్లో ఓ బాలిక న్యూడ్ వీడియో కనిపించడంతో అతడు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన ప్రస్తుతం తమిళనాడులో సెన్సేషనల్‌గా మారింది. సేలం జిల్లాకు చెందిన అరవింద్ కు ఇటీవల ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. వీరు పెళ్లికి ముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకునేందుకు లవ్ టుడే సినిమా స్ఫూర్తితో సెల్ ఫోన్లు మార్చుకున్నారు.
ఇలా ఫోన్లు మార్చుకున్న తర్వాత యువతి అరవింద్ మొబైల్ ని చెక్ చేస్తుండగా ఓ బాలిక న్యూడ్ వీడియో కనిపించింది. బంధువుల సహాయంతో ఆ వీడియోలో ఉన్న బాధితురాలి వివరాలు సేకరించింది. ఆమెకు విషయం తెలిపింది. చివరకు ఈ వ్యవహారం పోలీసుల వరకు చేరడంతో వారు అరవింద్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. లవ్ టుడే సినిమాలో హీరో హీరోయిన్లు సెల్‌ఫోన్లు మార్చుకోవడం వల్ల వారిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ చివరికి ఒక్కటవుతారు. కానీ, నిజజీవితంలో ఓ జంట ఇలా ఫోన్లు మార్చుకోగా.. యువకుడి అసలు రూపం బయటపడి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ప్రస్తుతం తమిళనాడులో సంచలనం సృష్టిస్తోంది.