'బీజేపీ అధికార కోల్పోతే మిమ్మల్ని అరెస్ట్ చేసినా హింసించినా ఎవరు కాపాడుతారు'
“బిజెపి ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేస్తున్న తీరు చూస్తూ ఉంటే, రేపు బీజేపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నాయకుల పరిస్థితి గురించి ఆలోచిస్తే భయమేస్తున్నది. వచ్చే ప్రభుత్వం రేపు బీజేపీ నాయకులను ఇలాగే అరెస్టులు , హింసలపాలు చేస్తే వారికి ఎవరు సహాయం చేస్తారు ?”అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశాడు.
రేపు బీజేపీ అధికారం కోల్పోతే, అవ్చ్చే ప్రభుత్వం బిజెపి నాయకులను అరెస్టు చేసినా, హింసించినా వారికి ఎవరు సహాయం చేస్తారని ఉద్ధవ్ ఠాక్రే సేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
“బిజెపి ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేస్తున్న తీరు చూస్తూ ఉంటే, రేపు బీజేపీ అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నాయకుల పరిస్థితి గురించి ఆలోచిస్తే భయమేస్తున్నది. వచ్చే ప్రభుత్వం రేపు బీజేపీ నాయకులను ఇలాగే అరెస్టులు , హింసలపాలు చేస్తే వారికి ఎవరు సహాయం చేస్తారు ?”అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశాడు.
సంజయ్ రౌత్‌ను కూడా మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత జూలైలో అరెస్టు చేసింది.
కాగా మనీష్ సిసోడియా అరెస్ట్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ "డర్టీ పాలిటిక్స్" గా అభివర్ణించారు. ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్న తీరుపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు మనీష్ సిసోడియా అరెస్టును నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు.
The way BJP is arresting Opposition Leaders, I dread, what will happen to BJP leaders in future when they will be out of power. What if they are similarly persecuted/arrested? Who will come to their help? @ArvindKejriwal @OfficeofUT #ManishSisodiaArrested pic.twitter.com/PgSB7xN3W1
— Sanjay Raut (@rautsanjay61) February 26, 2023