Telugu Global
National

వికాస్ కుమార్ గా తేలిన రషీద్ ఖాన్... విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర‌

ఢిల్లీలో జరిగిన శ్రద్దా వాకర్ హత్యను సమర్దిస్తూ , తాను కూడా ఇలాగే హిందూ యువతులను ముక్కలుముక్కలుగా నరుకుతానని రషీద్ ఖాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది.

వికాస్ కుమార్ గా తేలిన రషీద్ ఖాన్... విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర‌
X

ఢిల్లీలో అఫ్తాబ్ అనే వ్యక్తి తన ప్రియురాలు శ్రద్ధా వాకర్ ను హత్య చేసి ఆ శవాన్ని35 ముక్కలుగా నరికి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసిన విషయం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా సంచలనం అయిన ఈ సంఘటనపై ప్రజలు ధిగ్భ్రాంతికి గురయ్యారు. మరో వైపు కొందరు మతాధార విద్వేషాలు రెచ్చగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓ క్రూరుడు ఓ యువతిని చంపిన సంఘటనలా కాకుండా, ఓ ముస్లిం ఓ హిందూ యువతిని చంపిన సంఘటనగా ప్రచారం చేస్తున్నారు.

ఈ అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఈ హత్యను సమర్దిస్తూ , తాను కూడా ఇలాగే హిందూ యువతులను ముక్కలుముక్కలుగా నరుకుతానని రషీద్ ఖాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది. దీని ఆధారంగా కొన్ని హిందుత్వ గ్రూపులు ముస్లింలపై విద్వేష ప్రచారాన్ని తీవ్రం చేశాయి. లవ్ జీహాదీ అంటూ రాగాలందుకున్నాయి. సాధారణ నెటిజనులు కూడా రషీద్ ఖాన్ పోస్ట్ చూసి నివ్వెర పోయారు.

రషీద్ ఖాన్ కోసం ఉత్తరప్రదేశ్,బులంద్‌షహర్ పోలీసులు తీవ్రంగా గాలించి అతన్ని పట్టుకున్నారు. అతన్ని విచారించగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. అసలు అతని పేరు రషీద్ ఖాన్ కాదు. అతనుముస్లిం కాదు. అతని అసలు పేరు వికాస్ కుమార్. కావాలనే రషీద్ ఖాన్ పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడానికి అతను ప్రయత్నించాడని పోలీసు విచారణలో వెల్లడైంది. సోషల్ మీడియాలో తాను ముస్లిం అని నమ్మించడం కోసం వికాస్ కుమార్ గడ్డం కూడా పెంచాడు.

బులంద్‌షహర్ ఎస్‌ఎస్పీ మాట్లాడుతూ.. వికాస్ కుమార్ రషీద్ ఖాన్‌గా నటిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. అతడిని అరెస్టు చేశామని, అతనిపై గతంలోపలు దొంగతనాల కేసులు కూడా నమోదయ్యాయని ఎస్‌ఎస్పీ తెలిపారు

.

వికాస్ కుమార్ అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో కొనసాగుతున్న విద్వేషాల రేసుకు తెరపడనుంది. కానీ ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారు మాత్రం ఇక్కడితో ఆగరు. వారు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారి పని విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే. అసలు ఈ వికాస్ కుమార్ లాంటి వాళ్ళ వెనక ఉన్నది ఎవరన్నది ఎప్పటికీ తెలియకపోవచ్చు కూడా !

First Published:  26 Nov 2022 11:24 AM IST
Next Story