రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్యకు తృణమూల్ రాజ్యసభ టికెట్
దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్నాయి. అందులో బెంగాల్‌లో 5 స్థానాలున్నాయి. వీటిలో సాగరిక ఘోష్‌తోపాటు మిగిలినవారిని ఎంపిక చేసినట్లు టీఎంసీ ఎక్స్‌లో ప్రకటించింది.
ప్రముఖ జర్నలిస్టు సాగరిక ఘోష్ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలబడనున్నారు.. ఆమెతోపాటు మొత్తం నలుగురిని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. సాగరిక ఘోష్ పేరుమోసిన జర్నలిస్టు, సీఎన్ఎన్ ఐబీఎన్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్య కావడం గమనార్హం.
దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్నాయి. అందులో బెంగాల్‌లో 5 స్థానాలున్నాయి. వీటిలో సాగరిక ఘోష్‌తోపాటు మిగిలినవారిని ఎంపిక చేసినట్లు టీఎంసీ ఎక్స్‌లో ప్రకటించింది. ‘‘రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులుగా సాగరిక ఘోష్, సుస్మితా దేవ్, మహ్మద్ నదిముల్ హక్, మమతా ఠాకూర్‌లను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. వారందరికీ శుభాకాంక్షలు. తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికైన వీరంతా భారతీయుల హక్కుల కోసం వాదించే మా పార్టీ వారసత్వాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాం’’ అని టీఎంసీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
మీడియాలో పలు అవార్డులు
పలు మీడియా సంస్థల్లో పని చేసిన సాగరిక ఘోష్‌కు జర్నలిజంలో విశేష అనుభవం ఉంది. దేశంలో పేరొందిన అతికొద్దిమంది మహిళా జర్నలిస్టులో సాగరిక ఒకరు. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొందారు. చాలా పుస్తకాలు కూడా రాశారు.