నిర్మాణ దశలోనే కూలిన రైల్వే వంతెన..17 మంది మృతి
మిజోరంలోని ఐజ్వాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిరాంగ్ ప్రాంతంలో రైల్వే వంతెన నిర్మాణం జరుగుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో మిజోరం రాజధాని ఇజ్వాల్ ను కలిపేందుకు 51.38 కిలోమీటర్ల దూరం ఓ కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు.
మిజోరంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన కుప్పకూలిన సంఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సగానికంటే ఎక్కువమంది ఆచూకీ తెలియకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని మోడీ తక్షణం స్పందించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 అందజేయనున్నారు.
Pained by the bridge mishap in Mizoram. Condolences to those who have lost their loved ones. May the injured recover soon. Rescue operations are underway and all possible assistance is being given to those affected.
— PMO India (@PMOIndia) August 23, 2023
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the…
నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో మిజోరంలో విషాదం చోటు చేసుకుంది. మిజోరంలోని ఐజ్వాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిరాంగ్ ప్రాంతంలో రైల్వే వంతెన నిర్మాణం జరుగుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో మిజోరం రాజధాని ఇజ్వాల్ ను కలిపేందుకు 51.38 కిలోమీటర్ల దూరం ఓ కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో 35 నుంచి 40 మంది కార్మికులు పనిలో ఉండగా ఈ బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు మృతిచెందారు. మిగతా కార్మికులు ఆచూకీ దొరకకపోవడంతో వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వారు బ్రిడ్జి శిథిలాల క్రింద చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు.
Under construction railway over bridge at Sairang, near Aizawl collapsed today; atleast 17 workers died: Rescue under progress.
— Zoramthanga (@ZoramthangaCM) August 23, 2023
Deeply saddened and affected by this tragedy. I extend my deepest condolences to all the bereaved families and wishing a speedy recovery to the… pic.twitter.com/IbmjtHSPT7
ఈ దుర్ఘటనపై మిజోరం సీఎం జోరంతంగ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయపడటానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారిక కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50,000 అందజేయనున్నారు. ఈ మేరకు PMO ట్విట్టర్లో అకౌంట్ నుంచి సమాచారం విడుదల చేశారు.
*