Telugu Global
National

రైల్వే కూలీగా కొత్త గెటప్.. సూట్ కేస్ మోసిన రాహుల్

రాహుల్ గాంధీ రైల్వే కార్మికుడి గెటప్ వేయడంతోపాటు, సూట్ కేస్ కూడా మోసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్, మోదీకి పోలిక పెడుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

రైల్వే కూలీగా కొత్త గెటప్.. సూట్ కేస్ మోసిన రాహుల్
X

రైల్వే కూలీగా రాహుల్ గాంధీ సరికొత్త అవతారంలో కనిపించారు. ఎర్ర చొక్కా ధరించి, చేతికి బ్యాడ్జి పెట్టుకున్నారు. రైల్వే కూలీలతో కలసిపోయి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సూట్ కేసు మోసి వారిలో ఒకడిగా మారిపోయారు. రాహుల్ గాంధీ తమతో కలసి తమలాగే డ్రస్ వేసుకుని, సూట్ కేసు మోయడంతో రైల్వే కూలీలు సంబరపడిపోయారు. ఈ ఘటన ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో జరిగింది.


భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ.. వివిధ వర్గాలు, వివిధ వృత్తులు చేసేవారితో సమావేశమయ్యారు. కొంతమందిని మాత్రం కలసుకోలేకపోయారు. ఇటీవల రైల్వే కార్మికులు రాహుల్ ని కలవాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. తమ సమస్యలు ఆయనకు చెప్పుకోవాలని, ఆయన అపాయింట్ మెంట్ కావాలన్నారు. దీనికి రాహుల్ స్పందించారు. వారినే తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలన్నారు. వారు చెప్పిన టైమ్ కి, వారు సూచించిన ప్రదేశానికి వస్తానన్నారు. అలా ఈరోజు రాహుల్ గాంధీ రైల్వే కూలీలతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో రాహుల్ గాంధీ కార్మికులతో కూర్చుని మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


వైరల్ అవుతున్న వీడియో..

రాహుల్ గాంధీ రైల్వే కార్మికుడిగా గెటప్ వేయడంతోపాటు, సూట్ కేస్ కూడా మోసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్, మోదీకి పోలిక పెడుతూ సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ మొదలైంది. రాహుల్ ని జన నాయకుడంటున్నారు కాంగ్రెస్ నేతలు, మోదీని కార్పొరేట్ నాయకుడని అభివర్ణిస్తూ విమర్శలు మొదలు పెట్టారు.

First Published:  21 Sept 2023 11:47 AM IST
Next Story