Telugu Global
National

మా దగ్గర విపక్షాల మైక్ లు పనిచేయవు.. యూకే ఎంపీలతో రాహుల్

2004లో వాజ్ పేయి ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భమే ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందని 2024లో మోదీ ఎదుర్కోబోయే ఎన్నికలు కూడా అలాగే ఉంటాయని చెప్పారు రాహుల్ గాంధీ.

మా దగ్గర విపక్షాల మైక్ లు పనిచేయవు.. యూకే ఎంపీలతో రాహుల్
X

యూకే పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. ఇటీవల అక్కడి పార్లమెంట్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత పార్లమెంట్ వ్యవస్థ ఎలా ఉంటుందో వారికి వివరించారు. ముఖ్యంగా పార్లమెంట్ లో మాట్లాడే సమయంలో విపక్షాల మైక్ లు అన్యాయంగా కట్ చేస్తారనే విషయాన్ని వారికి తెలియజేశారు. విపక్ష నేతల ముందు మైక్ లు ఉంటాయి. కానీ వాటిన ఆన్ చేయాలంటే కుదరదు, మాట్లాడాలంటే అస్సలు సాద్యం కాదు. ప్రభుత్వం అనుకున్నప్పుడే మనకు అవకాశం వస్తుంది అని చెప్పారు.

పెద్ద నోట్లరద్దు అనేది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపించిందని, ఆ నిర్ణయం వ్యవస్థను నాశనం చేసిందని చెప్పారు రాహుల్ గాంధీ. భారత పార్లమెంట్ లో ఇలాంటి విషయాలపై చర్చలు జరగవని, జీఎస్టీ నిర్ణయాలపై కూడా చర్చించే అవకాశం లేదని, చైనా దళాలు భారత్ లో ప్రవేశిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయంపై కూడా ప్రతిపక్షాల ప్రశ్నించలేవని అన్నారు.

2004లో వాజ్ పేయి ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భమే ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందని 2024లో మోదీ ఎదుర్కోబోయే ఎన్నికలు కూడా అలాగే ఉంటాయని చెప్పారు రాహుల్ గాంధీ. భారత్ తో యూకే సంబంధాలపై కూడా రాహుల్ స్పందించారు. ఉద్యోగ అవకాశాల కల్పనకు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అవసరం అని అన్నారాయన. ఇప్పటికే రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. విదేశాల్లో భారత పరువు తీస్తున్నారంటూ మండిపడింది. దీనికి రాహుల్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తానేమీ మోదీలాగా భారత దేశం పరువు తీయలేదని చెప్పుకొచ్చారు. విదేశాల్లో మోదీ వ్యాఖ్యలు తనకింకా గుర్తున్నాయన్నారు. తాజాగా యూకే ఎంపీల వద్ద భారత పార్లమెంట్ గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ సంచలనంగా మారాయి.

First Published:  7 March 2023 11:08 AM IST
Next Story