స్వర్ణ దేవాలయంలోకి రాహుల్.. ప్రత్యేకత ఏంటంటే..?
భారత్ జోడో యాత్ర పంజాబ్ చేరుకున్న సందర్భంగా అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు రాహుల్ గాంధీ. కాషాయ రంగు తలపాగా ధరించిన రాహుల్, కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వాతో కలసి గోల్డెన్ టెంపుల్ లోకి వెళ్లారు.
రాహుల్ గాంధీ ఈరోజు స్వర్ణ దేవాలయంలోకి వెళ్లారు. దాదాపు 20నిమిషాలపాటు ఆయన లోపల ఉన్నారు. అక్కడ కీర్తనలు వింటూ ప్రార్థనల్లో పాల్గొన్నారు. విశేషం ఏంటంటే..39 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి స్వర్ణ దేవాలయంలోకి అడుగు పెట్టడం. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ అనంతరం గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులెవరూ స్వర్ణ దేవాలయంలో అడుగు పెట్టలేదు. దాన్ని బ్రేక్ చేస్తూ రాహుల్ గాంధీ ఈరోజు గోల్డెన్ టెంపుల్ లో అడుగు పెట్టారు. సిక్కు మిలిటెంట్లను హతమార్చేందుకు ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. దాని తర్వాత ఆమెను సిక్కు వర్గానికి చెందిన కొందరు టార్గెట్ చేశారు. చివరకు ఆమెకు సెక్యూరిటీగా ఉన్న సిక్కులే ఆమెను హతమార్చారు. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులెవరూ స్వర్ణ దేవాలయంలోకి వెళ్లలేదు. ఇన్నాళ్లకు మళ్లీ రాహుల్ అడుగు పెట్టడం విశేషం.
భారత్ జోడో యాత్ర పంజాబ్ చేరుకున్న సందర్భంగా అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు రాహుల్ గాంధీ. కాషాయ రంగు తలపాగా ధరించిన రాహుల్, కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వాతో కలసి గోల్డెన్ టెంపుల్ లోకి వెళ్లారు. గోల్డెన్ టెంపుల్ విశిష్టతను రాహుల్ గాంధీకి ప్రతాప్ సింగ్ బజ్వా వివరించారు. తల వంచుకుని కొంత సేపు కీర్తనలు వింటూ అక్కడే గడిపారు రాహుల్. దాదాపు 20 నిమిషాల పాటు కీర్తనలు వింటూ రాహుల్ లోపలే కూర్చున్నారు.
कर्ज़ देश की मिट्टी का चुकाना है,
— Bharat Jodo (@bharatjodo) January 10, 2023
देश को एक बनाना है।
जाति—धर्म का झगड़ा खत्म हो।
मोहब्बत का सब पर,
ऐसा रंग चढ़ाना है।#BharatJodoYatra pic.twitter.com/IzpfEr0LT9
బయటే సెక్యూరిటీ..
రాహుల్ గాంధీకి మూడంచెల భద్రత ఉన్నప్పటికీ.. భద్రతా సిబ్బందిని బయటే వదిలిపెట్టి రాహుల్ గాంధీ స్వర్ణ దేవాలయంలోకి వెళ్లారు. ఆయన లోపలికి వెళ్లే సమయంలో కొంతసేపు క్యూ లైన్లు నిలిపివేశారు. పంజాబ్ లో రాహుల్ గాంధీ 10 రోజులపాటు 350 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. భద్రతా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఆయన యాత్రలో కొన్ని మార్పులు చేశారు. కారులో ఆయన కొంతదూరం యాత్రలో పాల్గొంటారు. మిగతా చోట్ల కాలినడకన భారత్ జోడో యాత్ర చేపడతారు.