పరువుకోసమే గవర్నర్ తలొంచారా?
పంజాబ్ లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. ఈనెల 27వ తేదీన పంజాబ్ లో జరగాల్సిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆమోదం తెలిపారు.
పంజాబ్ లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. ఈనెల 27వ తేదీన పంజాబ్ లో జరగాల్సిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆమోదం తెలిపారు. ఈనెల 27వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరుపుకోవాలని ఆప్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నుండి గవర్నర్ కు లేఖ వెళ్ళింది. అయితే ఆ లేఖను పురోహిత్ తిరస్కరించారు.
ప్రత్యేక సమావేశానికి తాను అనుమతించేది లేదని కచ్చితంగా చెప్పేశారు. అంతకుముందే 21వ తేదీన నిర్వహించాలని అనుకున్న బలపరీక్షకు కూడా గవర్నర్ అడ్డుపడ్డారు. దాంతో ఆరోజు నిర్వహించాలని అనుకున్న బలపరీక్షను ప్రభుత్వం నిర్వహించలేకపోయింది. దాంతో అప్పటి నుండి ముఖ్యమంత్రికి బాగా మండుతోంది. అందుకనే వ్యూహాత్మకంగా 27వ తేదీన ప్రత్యేక సమావేశం అంటు మళ్ళీ లేఖను పంపారు. దీనిని కూడా గవర్నర్ తిరస్కరించారు.
గవర్నర్ వైఖరికి నిరసనగా ఆప్ ఎంఎల్ఏలంతా కలిసి ఏకంగా రాజభవన్ ముందు పెద్దఎత్తున ధర్నానే నిర్వహించారు. దాంతో ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య గొడవ రోడ్డున పడినట్లయ్యింది. ఈ విషయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం చివరకు గవర్నర్ ఆమోదంలేకపోయినా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తీరుతామని ప్రకటించేసింది. సమావేశాల నిర్వహణకు రెడీ అయిపోతోంది. గవర్నర్ ఆమోదం అన్నది కేవలం లాంఛనం మాత్రమే అని ప్రభుత్వం ప్రకటించింది.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ ఆమోదం అవసరమే లేదేని, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం కేవలం లాంఛనమే అని ఆప్ ప్రకటించింది. దీంతో గవర్నర్ ఏమి ఆలోచించారో ఏమో. తన ప్రమేయం లేకుండానే సమావేశాలు జరిగిపోతే ఇక తనకు విలువ ఏముంటుందని అనుకున్నట్లున్నారు. నిపుణులను కూడా సంప్రదించినట్లున్నారు. తాను అనుమతించకపోయినా సమావేశాలను జరపాలని ఆప్ ప్రభుత్వం డిసైడ్ అయిన తర్వాత ఆపటం కష్టమే అని అర్ధమైనట్లుంది. అందుకనే చివరి నిముషంలో ప్రత్యేక సమావేశానికి ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య తలెత్తిన వివాదం తాత్కాలికంగా తొలగినట్లయ్యింది.