Telugu Global
National

చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ న్యూ ప్లాన్

భారత ఆర్మీ జోరావార్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. చైనాను సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు తక్కువ బరువుండే యుద్ద ట్యాంకులను సమీకరించాలని ఆర్మీ నిర్ణయించింది.

చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ న్యూ ప్లాన్
X

సరిహద్దుల్లో చైనాను సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ 'ప్రాజెక్ట్ జోరావార్'ను ప్రారంభించినట్టు ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. తక్కువ బ‌రువుండే స్వదేశీ యుద్ధట్యాంకులను ఆర్మీ సమకూర్చుకోనుంది. 350 కి పైగా 'జోరావార్' యుద్ధట్యాంకులను ఆర్మీ అమ్ముల పొదిలో చేర్చాలని ఆర్మీ నిర్ణయించింది. తక్కువ బ‌రువుండే ఈ యుద్ద ట్యాంకులను వాయుమార్గంలో, భూ మార్గంలో కూడా సులభంగా తరలించవచ్చు. పర్వత ప్రాంతాల్లో ఈ ట్యాంకులు సౌకర్యవంతంగా ఉంటాయని ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ట్యాంకులు అధిక ఫైర్ శక్తితోపాటు 25 టన్నుల బరువు మించకూడదని ఆర్మీ నిర్దేశించింది.

అంతే కాక రెండు భారత స్టార్టప్ కంపెనీల నుంచి డ్రోన్లను కొనుగోలు చేయాలని ఆర్మీ నిర్ణయించింది. ఈ డ్రోన్లు అత్యంత ఎత్తులో కానీ, లోతట్టు ప్రాంతాల్లో గానీ టార్గెట్ లపై దాడులకు ఉపయోగకరంగా ఉంటాయని ఆర్మీ చెప్తోంది.

First Published:  27 Aug 2022 2:50 PM GMT
Next Story