Telugu Global
National

రాహుల్‌ స్థానం నుంచే ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ!

జాతీయ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ఉన్న ప్రాధాన్యత రీత్యా రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రాహుల్‌ స్థానం నుంచే ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ!
X

రాయ్‌బరేలీ, వయనాడ్‌ నియోజకవర్గాల నుంచి ఎంపీగా పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు స్థానాల్లోనూ భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ రెండు సీట్లలో రాహుల్‌ ఏదో ఒకటి వదులుకోవాల్సిందే. తమ దగ్గరి నుంచే ఎంపీగా కొనసాగాలంటూ ఇరు రాష్ట్రాల కాంగ్రెస్‌ సీనియర్లు రాహుల్‌ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తన నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలకు సంతోషాన్ని ఇస్తుందని రాహుల్‌ తాజాగా స్పష్టం చేశారు. ఇరుచోట్లా పర్యటించిన అనంతరం వయనాడ్‌నే వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

రాహుల్‌గాంధీ వదిలేసే వయనాడ్‌ నుంచి కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ఉన్న ప్రాధాన్యత రీత్యా రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాయ్‌బరేలీ సీటు వదులుకోవద్దని అమేథీ కాంగ్రెస్‌ఎంపీ కిషోరీలాల్ శర్మ ఇప్పటికే రాహుల్‌కు విజ్ఞప్తి చేశారు. అదే టైంలో రాహుల్ వయనాడ్‌ను వదులుకోవచ్చని కేరళ కాంగ్రెస్ చీఫ్ కే. సుధాకరన్ సంకేతాలిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్న సీటులో నుంచే చెల్లి రాజకీయ అరంగేట్రం ఖాయమనే చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లోనే ప్రియాంకగాంధీ పోటీకి దిగుతారని వార్తలు వచ్చినా ఆమె పోటీ చేయలేదు.

First Published:  14 Jun 2024 7:47 AM GMT
Next Story