మోదీని బోనులో నిలబెట్టిన ప్రియాంక..
WFI చీఫ్ గా బ్రిజ్ భూషణ్ ని తప్పించేందుకు కేంద్రంలోని పెద్దలెవరూ సాహసం చేయడంలేదు. దాన్ని అలుసుగా తీసుకుని బ్రిజ్ భూషణ్, మరింత రెచ్చిపోతున్నారు. కేంద్రంలోని పెద్దలు తనని కోరితే అప్పుడు రాజీనామా చేస్తానని చెబుతున్నారు.
తమకు న్యాయం చేయాలంటూ భారత రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలనేది రెజ్లర్ల ప్రధాన డిమాండ్. అయితే తానే తప్పు చేయలేదని వాదిస్తున్నారు బ్రిజ్ భూషణ్. తప్పు చేయని తాను పదవికి రాజీనామా చేసేది లేదంటూ మొండికేశారు. అయితే పార్టీ అగ్రనేతలు కోరితే తాను తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నట్టుగా తాజాగా మీడియాలో కథనాలు వచ్చాయి. అంటే బీజేపీ పెద్దలే ఆయన రాజీనామాకు ఒప్పుకోవడంలేదని ఇప్పుడు తేలిపోయింది. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రియాంక గాంధీ మరోసారి హైలెట్ చేశారు. WFI చీఫ్ గా బ్రిజ్ భూషణ్ రాజీనామా కోరాలంటూ ఆమె ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. పెద్దలు అడిగితేనా రాజీనామా చేస్తానంటున్న బ్రిజ్ భూషణ్ వ్యవహారంలో బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. "మోదీజీ మీరే ఆయన్ను అడగండి, అప్పుడు రాజీనామా చేస్తారు, మీరిచ్చే సమాధానం కోసం, న్యాయం ఎదురుచూస్తోంది." అంటూ ట్వీట్ చేశారు ప్రియాంక.
… @narendramodi जी कह दीजिए ।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 1, 2023
न्याय को आपकी “हाँ” का इंतजार है। https://t.co/l8MFUbDcuv
ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళనకు బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. సామాజిక కార్యకర్తలు, ఇతర క్రీడాకారులు కూడా వారి సమస్యను పరిష్కరించాలని గొంతు కలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ బ్రిజ్ భూషణ్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకోడానికి కూడా కేంద్రం వెనకడుగేస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
WFI చీఫ్ గా బ్రిజ్ భూషణ్ ని తప్పించేందుకు కేంద్రంలోని పెద్దలెవరూ సాహసం చేయడంలేదు. దాన్ని అలుసుగా తీసుకుని బ్రిజ్ భూషణ్, మరింత రెచ్చిపోతున్నారు. కేంద్రంలోని పెద్దలు తనని కోరితే అప్పుడు రాజీనామా చేస్తానని చెబుతున్నారు. అయితే ఆయన బహిరంగంగా ఈ ప్రకటన చేయలేదు. మీడియాలో వస్తున్న కథనాలని కోట్ చేస్తూ నేరుగా మోదీని ట్యాగ్ చేశారు ప్రియాంక గాంధీ. దీంతో ఈ వ్యవహారం మరింత హైలెట్ గా మారింది. ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిందేనంటూ రెజ్లర్లు పట్టుబట్టారు. బీజేపీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.